బ్యాట్స్‌మెన్లు కాదు.. ప్రభుత్వ ఉద్యోగులు అంటూ.. చెన్నై జట్టుపై సెహ్వాగ్ ఘాటు విమర్శలు

  • Published By: vamsi ,Published On : October 12, 2020 / 06:43 PM IST
బ్యాట్స్‌మెన్లు కాదు.. ప్రభుత్వ ఉద్యోగులు అంటూ.. చెన్నై జట్టుపై సెహ్వాగ్ ఘాటు విమర్శలు

IPL 2020-Virender Sehwag on Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్-2020) 13 వ సీజన్‌లో, ప్రతి మ్యాచ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు పరిస్థితి మరింత దిగజారి పోతుంది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని CSK ఇప్పటివరకు మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది చెన్నై జట్టు. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు వెళ్లడం కూడా కష్టమే అన్న రీతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతుంది. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) CSKని 37 పరుగుల తేడాతో ఓడించింది చెన్నై జట్టు. ఈ మ్యాచ్ తరువాత, వీరేందర్ సెహ్వాగ్ ట్విట్టర్లో ఆ జట్టును ఏకి పారేస్తున్నాడు.



ఈ ఐపీఎల్‌ సీజన్‌లో వరుస వైఫల్యాలతో సతమతం అవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు.. ఒకప్పటి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కాదని అన్నారు. అప్పటి చెన్నై జట్టుకు.. ఈ జట్టుకు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. అసలు సీఎస్‌కే అంటే ఇదికాదు. గతంలో సీఎస్‌కేతో పోరు అంటే ప్రత్యర్థి జట్లు చివరి వరకూ భయపడుతూనే ఉండేది. ఇప్పుడు ఆ జట్టుతో పోరు అంటే ఓడించడం పెద్ద కష్టం కాదు అన్నట్లుగా మిగతా జట్లు భావిస్తున్నాయి.



ఈ సీజన్‌లో సీఎస్‌కే జట్టు.. ఆ జట్టు ఫ్యాన్స్‌నే కాదు.. క్రికెట్‌ను అభిమానించే ప్రతి ఒక్కరినీ నిరాశకు గురిచేస్తుంది.. ప్రధానంగా సీఎస్‌కే బ్యాటింగ్‌ దారుణంగా ఉంది. మహామహా ఆటగాళ్లు సైతం సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ బాట పట్టేస్తున్నారు. క్రీజ్‌లోకి వెళ్లాం.. వచ్చాం అనే రీతిలో ఆడుతున్నారు. ఇదే విషయాన్ని వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తావించారు. శనివారం RCBతో జరిగిన మ్యాచ్‌లో CSK ఘోరంగా ఓడిపోయింది. RCB నిర్దేశించిన 170 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 132 పరుగులకే పరిమితమైంది.



ముఖ్యంగా జట్టులో ధోనీ విఫలం అవడం గురించి విమర్శలు గట్టిగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘చెన్నై అభిమానుల పట్ల నాకు బాధగా ఉంది’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు. ఇది చివరి వరకు పోరాడి ప్రత్యర్థికి ముప్పు తెచ్చిన జట్టు. అయితే, ఈ సంవత్సరం చాలా నిరాశపరిచింది, ముఖ్యంగా బ్యాటింగ్ అని సెహ్వీగ్ అన్నాడు. అంతకుముందు కూడా సెహ్వాగ్ చెన్నై జట్టు బ్యాట్స్ మెన్లను ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చారు. చెన్నై జట్టులోని కొందరు బ్యాట్స్‌మెన్లు ఫ్రాంచైజీని ‘ప్రభుత్వ ఉద్యోగం’గా భావిస్తున్నారని, ఇందులో పనితీరు లేకుండా కూడా జీతం పొందుతున్నారని ఘాటుగానే విమర్శలు చేశారు.