CSK vs SRH : సన్ రైజర్ హైదరాబాద్ పై చెన్నై విజయం

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

10TV Telugu News

IPL 2021 : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల కోల్పోయి 171 పరుగులు సాధించింది. అనంతరం 172 రన్ల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన చెన్నై జట్టు..18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.

ఓపెనర్స్ అదరహో అనిపించారు. రుతురాజ్ గైక్వడ్ అద్బుత ప్రదర్శన చేశాడు. ఇతనికి డుప్లెసిస్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించారు. వీరిని అవుట్ చేసేందుకు సన్ రైజర్స్ బౌలర్లు శ్రమించారు. హాఫ్ సెంచరీలు సాధించి..మంచి ఊపు మీదుండగా…జట్టు స్కోరు 129 పరుగుల వద్ద గైక్వాడ్ (75) వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన మెయిన్ ఆలీ..(15) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.

148 పరుగుల వద్ద డుప్లెసిస్ (56)ను రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. విజయానికి కావాల్సిన పరుగులను జడేజా 7, రైనా 17 నాటౌట్ గా నిలిచి..జట్టును విజయతీరాల వైపుకు తీసుకెళ్లారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. రషీద్ ఖాన్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఆదిలోనే ఓపెనర్ జానీ బెయిర్ స్టో (7) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (57), మనీశ్ పాండే (61) ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. రెండో వికెట్ కు 106 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో ధాటిగా ఆడే క్రమంలో…ఎంగిడి వేసిన 18వ ఓవర్ లో ఇద్దరూ పెవిలియన్ చేరారు.

అప్పటికీ జట్టు స్కోరు 3 వికెట్ల నష్టానికి 138 పరుగులు. తర్వాత వచ్చిన విలియమ్సన్ (26 నాటౌట్), కేదార్ జాదవ్ (12 నాటౌట్) బ్యాట్ కు పని చెప్పారు. చివరి రెండు ఓవర్లలో 33 పరుగులు రాబట్టుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ఎంగిడి రెండు, సామ్ కరన్ ఒక వికెట్ తీశారు.\

Read More : Ajay Devgn : కరోనా వేళ..ముంబై కార్పొరేషన్ కు అజయ్ దేవ్ గన్ మద్దతు

10TV Telugu News