IPL2023 Final: ఐపీఎల్‌-16 టైటిల్ విజేత‌గా చెన్నై.. ఉత్కంఠ పోరులో గుజ‌రాత్ పై విజ‌యం

చెన్నై సూప‌ర్ కింగ్స్ అద‌ర‌గొట్టింది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్ర‌మంలో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక టైటిళ్లు అందుతున్న ముంబై ఇండియ‌న్స్ రికార్డును స‌మం చేసింది.

IPL2023 Final:  ఐపీఎల్‌-16 టైటిల్ విజేత‌గా చెన్నై.. ఉత్కంఠ పోరులో గుజ‌రాత్ పై విజ‌యం

csk win

IPL Final: చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) అద‌ర‌గొట్టింది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్ర‌మంలో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక టైటిళ్లు అందుకున్న‌ ముంబై ఇండియ‌న్స్ రికార్డును స‌మం చేసింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో చెన్నై  5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

గుజ‌రాత్ ఇన్నింగ్స్ ముగిసిన త‌రువాత చెన్నై ఇన్నింగ్స్ ప్రారంభం కాగానే మొద‌టి ఓవ‌ర్‌లో మూడు బంతులు ప‌డ‌గానే వ‌ర్షం అంత‌రాయం క‌లిగింది. దీంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. వ‌ర్షం వెలిసిన త‌రువాత డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తి అనుస‌రించి 15 ఓవ‌ర్ల‌కు చెన్నై ల‌క్ష్యాన్ని 171 ప‌రుగులుగా నిర్దేశించారు.

చెన్నై బ్యాట‌ర్ల‌లో డెవాన్ కాన్వే(47; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రుతురాజ్ గైక్వాడ్‌(26; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), అజింక్యా ర‌హానే(27; 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శివ‌మ్ దూబే(32 నాటౌట్; 21 బంతుల్లో 2సిక్స‌ర్లు), అంబ‌టి రాయుడు (19; 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స‌ర్లు) దూకుడుగా ఆడారు. ఆఖ‌ర్లో చెన్నై విజ‌యానికి రెండు బంతుల్లో 10 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. ర‌వీంద్ర జ‌డేజా (15నాటౌట్; 6 బంతుల్లో 1 సిక్స్‌, 1 ఫోర్‌) వ‌రుస‌గా సిక్స్, ఫోర్ కొట్టి గెలిపించాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో మోహిత్ శ‌ర్మ మూడు వికెట్లు తీయ‌గా, నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

IPL2023 Final : మ్యాచ్ వాయిదా.. అభిమానుల అగ‌చాట్లు.. ధోనిని చూసేందుకు రైల్వే స్టేష‌న్‌లోనే ప‌డుకున్న చెన్నై ఫ్యాన్స్‌

అంత‌క‌ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన సాయి సుద‌ర్శ‌న్ (96; 47 బంతుల్లో 8ఫోర్లు, 6సిక్స‌ర్లు) దంచికొట్టాడు. వృద్ధిమాన్‌ సాహా (54; 39 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్‌) హాప్ సెంచ‌రీతో అల‌రించాడు. శుభ్‌మన్‌ గిల్‌ (39; 20 బంతుల్లో 7ఫోర్లు) ఆఖ‌ర్లో కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా(21 నాటౌట్‌; 12 బంతుల్లో 2 సిక్స‌ర్లు) ధాటిగా ఆడాడు. చెన్నై బౌల‌ర్ల‌లో ప‌తిర‌న రెండు వికెట్లు తీయ‌గా జ‌డేజా, దీప‌క్ చాహ‌ర్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

సాయి సుద‌ర్శ‌న్ శ‌త‌కం మిస్‌

గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుద‌ర్శ‌న్ ఆటే హైలెట్‌. చెన్నై బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌ల‌తో బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపాడు. 33 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని చేసిన సుద‌ర్శ‌న్ ఆ త‌రువాత ఒక్క‌సారిగా విజృంభించాడు. తుషార్ దేశ్ పాండే వేసిన 17వ ఓవ‌ర్‌లో 6,4,4,4 బాదాడు. ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌ను ప‌తిర‌న వేయ‌గా మొద‌టి రెండు బంతుల‌ను సిక్స్‌లుగా మలిచాడు. అయితే.. ఆ త‌రువాతి బంతికే ఎల్భీగా పెవిలియ‌న్‌కు చేరుకోవ‌డంతో శ‌త‌కం మిస్సైంది.

IPL2023 Final: ఉత్కంఠ పోరులో గుజ‌రాత్‌పై చెన్నై విజ‌యం.. క‌ప్పు ధోని సేన‌దే