Chess Olympiad : ఫైనల్ రౌండ్..నిలిచిన ఇంటర్నెట్, ఛాంపియన్లుగా ఇండియా, రష్యా

  • Published By: madhu ,Published On : August 31, 2020 / 10:21 AM IST
Chess Olympiad : ఫైనల్ రౌండ్..నిలిచిన ఇంటర్నెట్, ఛాంపియన్లుగా ఇండియా, రష్యా

ప్రతిష్టాత్మక Chess Olympiad లో భారత్ విజయం సాధించింది. రష్యాతో కలిసి సంయుక్తంగా స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ICF) ప్రకటించింది. తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి ప్రతిభ చాటడంతో భారత్ ఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఫస్ట్ టైమ్ ఆన్ లైన్ లో చెస్ ఒలింపియాడ్ పోటీ జరిగింది.



ఫైనల్ మ్యాచ్ రెండో రౌండ్ లో ఇద్దరు భారతీయ ఆటగాళ్లు నిహాల్ సరీన్, దివ్య దేశ్ ముఖ్ లు ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది. కోనేరు హంపి ఆడుతున్న సమయంలో ఇదే ప్రాబ్లం వచ్చింది. దీంతో భారత టీం అధికారికంగా ఫిడెకు అప్పీల్ చేసింది. దీంతో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత..ఫిడె అధ్యక్షుడు అర్కడీ వోర్కోవిచ్ ఓ నిర్ణయం తీసుకున్నారు.
https://10tv.in/kite-entangled-child-estimated-30-feet-into-air-in-viral-video/
భారత్, రష్యాలు రెండింటినీ సంయుక్త విజేతలుగా ప్రకటించాలని నిర్ణయించారు. ఆ రెండు జట్లకు బంగారు పతకాలు ప్రధానం చేయాలని నిర్ణయించినట్లు ఫిడె అధ్యక్షుడు అర్కడి వోర్కోవిచ్ వెల్లడించారు. అధికారిక చెస్ ఒలింపియాడ్ ప్రారంభమైనప్పటి నుంచి భారత్ ఫైనల్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.


విజయం సాధించిన భారత్ చెస్ బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం మిగతా అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో పాటు సంయుక్త విజేతగా నిలిచిన రష్యాకు కూడా ఆయన అభినందనలు తెలిపారు.

చాంపియన్‌గా నిలిచిన భారత్ జట్టుకు, అందులో సభ్యులైన తెలుగు ఆటగాళ్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెండ్యాల హరికృష్ణలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.