Pujara – Rizwan: కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో రిజ్వాన్ – పూజారా జోడీపై ట్విట్టర్ కౌంటర్స్

ఇండియన్ - పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఇది కన్నుల పండుగే. క్రీజులో ఓ ఎండ్‌లో చతేశ్వర్ పూజారా మరో వైపు మొహమ్మద్ రిజ్వాన్ ఆడుతున్న ఫొటోలు అందుకే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Pujara – Rizwan: కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో రిజ్వాన్ – పూజారా జోడీపై ట్విట్టర్ కౌంటర్స్

Pujara Rizwan

Pujara – Rizwan: ఇండియన్ – పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఇది కన్నుల పండుగే. క్రీజులో ఓ ఎండ్‌లో చతేశ్వర్ పూజారా మరో వైపు మొహమ్మద్ రిజ్వాన్ ఆడుతున్న ఫొటోలు అందుకే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కౌంటీ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఏప్రిల్ 14 గురువారం జరిగిన మ్యాచ్ లో డెర్బిషైర్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో సస్సెక్స్ ప్లేయర్లు ఇద్దరూ కలిసి బ్యాటింగ్ చేశారు.

పూజారా ఎక్కువ శాతం కౌంటీ ఛాంపియన్ షిప్, రాయల్ లండన్ వన్డే టోర్నోమెంట్ లలోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. అదే సమయంలో పాకిస్తాన్ బ్యాటర్ రిజ్వాన్ కూడా కౌంటీ ఛాంపియన్ షిప్, టీ20 క్రికెట్ లో జులై నెల మధ్య వరకూ ఉండాల్సి వచ్చింది.

“రిజ్వాన్, పూజారా లాంటి క్వాలిటీ ప్లేయర్లను తీసుకురావడం ఎగ్జైటింగ్ గా ఉంది. వారు వరల్డ్ క్లాస్ క్రికెటర్స్ మాత్రమే కాదు. వాళ్లు ఉండటంతో పిచ్ మీద మరింత ఉత్సాహం పెరుగుతుంది కూడా. వాళ్లు ఉండటంతో డ్రెస్సింగ్ రూంలోనూ పాజిటివ్ వాతావరణం కనిపిస్తుంది” అని సస్సెక్స్ హెడ్ కోచ్ సాలిసబరీ వెల్లడించారు.

Read Also: పూజారా, రహానెల భవిష్యత్ గురించి ఆలోచించడం నా పని కాదు – కోహ్లీ

ఇక వీరిద్దరి జోడీ విషయానికొస్త.. రిజ్వాన్, పూజారా కలిసి ఆడటం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఇరు దేశాల అభిమానులు. ఇంటర్నేషనల్ క్రికెట్ నెంబర్లను బట్టి చూస్తే.. పూజారా 95 టెస్టు మ్యాచ్ లు ఆడి 6వేల 713పరుగులు చేశాడు. అందులో 32 హాఫ్ సెంచరీలు, 18 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.

మరో వైపు పాకిస్తాన్ వికెట్ కీపర్ రిజ్వాన్ 22 టెస్టు మ్యాచ్ లు ఆడి 1112పరుగులు చేశాడు. టీ20, వన్డేల్లో 2వేల 559 పరుగులు చేయగా అందులో 17 హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి.