IPL 2019: క్రిస్ గేల్ యూనివర్స్ బాస్.. ఈజ్ బ్యాక్

IPL 2019: క్రిస్ గేల్ యూనివర్స్ బాస్.. ఈజ్ బ్యాక్

విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్.. ఆటలోనే కాదు. వినోదాల్లోనూ ముందుంటాడు. ఆటకు కొద్దిగా విరామం దొరికితే చాలు సరదాగా టూర్‌కు చెక్కేసే మళ్లీ ఐపీఎల్‌కు వచ్చేశానంటూ సంబరపడిపోతున్నాడు. కొడితే సిక్సర్లు లేదంటే బౌండరీలు బాదేసే గేల్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచే ఐపీఎల్ 2019సీజన్‌లోకి అడుగుపెట్టనున్నాడు. 
Read Also : ఐపీఎల్ కొత్త టీజర్: నేను కోహ్లీ కాదు

ఈ సందర్భంగా గేల్.. చేసిన ఓ వీడియోను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్టు చేసింది. దేఖో.. వో ఆ గయా.. అని పోస్టు చేసిన వీడియోలో గేల్ ‘యూనివర్స్ బాస్.. ఈజ్ బ్యాక్ అంటూ అరుస్తూ.. చప్పట్లతో హర్షాన్ని వ్యక్తం చేశాడు. 

గతేడాది జరిగిన ఐపీఎల్ 2018 వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వదిలిపెట్టేయడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆఖరి నిమిషాల్లో గేల్‌ను సొంతం చేసుకుంది. మార్చి 23నుంచి మొదలుకానున్న ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుల మధ్య చెపాక్ స్టేడియం వేదికగా జరగనుంది. 

Read Also : ఐపీఎల్ ముంగిట హాఫ్ సెంచరీతో మెప్పించిన రైనా