క్రిస్ గేల్‌ ఫిట్‌నెస్ మంత్ర: మసాజ్.. !!

10TV Telugu News

క్రిస్ గేల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఐదో వరల్డ్ కప్‌ ఆడబోతున్నాడు. 39 ఏళ్ల వయస్సులోనూ ఫిట్‌గా ఉంటోన్న గేల్ 2ఏళ్లుగా జిమ్‌కు కూడా దూరంగానే ఉంటున్నాడట. అతని ఫిట్‌నెస్‌లో రహస్యాలను విన్నవారు షాక్ తినకుండా ఉండరు. మ్యాచ్‌ల మధ్య విరామాల్లో చేసే పనులే ఇంతకాలం ఫిట్‌నెస్‌గా ఉంచుతున్నాయని చెప్పుకొచ్చాడు. 

‘మీకు తెలుసా. క్రికెట్ అనేది ఓ ఫన్నీ గేమ్. వరల్డ్ కప్ వస్తుందంటే పరుగుల వరదపారడం సర్వసాధారణం. నాకున్న అనుభవంతో నేను బ్యాటింగ్ చేసే ఫామ్‌తో సంతృప్తికరంగానే ఉన్నాను. గేమ్‌లో చాలా వంతు మానసికంగానే ఆడాల్సి ఉంటుంది. ఫిజికల్‌గా ఉండడానికి మానసికబలానికి తేడా ఉటుంది. నేను చాలా కాలం నుంచి జిమ్ కు వెళ్లడం మానేశాను. సుదీర్ఘంగా విశ్రాంతి మాత్రం తీసుకుంటున్నా. అలాగే శరీరానికి మసాజ్‌లు చేయించుకుంటున్నా. ఏ ఆటనైనా తాజాగా ఆరంభించాలని అనుకుంటా’

‘ఎప్పుడైనా నీకు వచ్చిందే చేయాలి. ఇప్పుడు నేను ఆడుతున్న క్రికెట్ మాత్రం అభిమానుల కోసమే ఆడుతున్నా. అబద్ధం చెప్పడం లేదు. రెండేళ్ల క్రితం వరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో నేనేంటో నిరూపించుకున్నా. కానీ, అభిమానులు నన్ను క్రికెట్ వదిలి వెళ్లొద్దంటుండటంతో తప్పడం లేదు. వరల్డ్ కప్ కోసమని కొన్ని నెలలుగా జాతీయ జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త టీంతో కొత్త ఫలితాలు అందుకోబోతున్నాం. కరేబియన్ ప్లేయర్లకు క్రికెట్ చాలా ముఖ్యమైనది.’ అని క్రిస్ గేల్ వల్లడించాడు. 

×