IPL-2023: విరాట్ కోహ్లీ గురించి ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

"నేను అప్పట్లో కోహ్లీని మొట్టమొదటిసారి కలిసినప్పుడు అహంకారి అనుకున్నాను. అతడి హెయిర్ స్టైల్, నడక తీరు చూసి ఆడంబరాలు ఎక్కువని భావించాను" అని ఏబీ డివిలియర్స్ చెప్పాడు.

IPL-2023: టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్( AB de Villiers) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2023 (IPL-2023) సీజన్ వేళ వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ తో ఓ ప్రోగ్రాంలో ఏబీ డివిలియర్స్ మాట్లాడాడు. కోహ్లీని మొదటిసారి కలిసినప్పుడు తాను కూడా అతడిని గర్విష్టుడు, అహంకారి అనుకున్నానని చెప్పాడు. అనంతరం కోహ్లీని పలు సార్లు కలిశాక అతడు మంచి వ్యక్తి అని అర్థమైందని తెలిపాడు.

“కోహ్లీ (Virat Kohli) గురించి ఈ ప్రశ్న నాకు ఇంతకు ముందు కూడా ఎదురైంది. దానికి సమాధానం కూడా చెప్పాను. నేను అప్పట్లో కోహ్లీని మొట్టమొదటిసారి కలిసినప్పుడు అహంకారి అనుకున్నాను. అతడి హెయిర్ స్టైల్, నడక తీరు చూసి ఆడంబరాలు ఎక్కువని భావించాను. అతడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాక అతడిపై గౌరవం పెరిగింది.

మంచి వ్యక్తి అని అర్థం చేసుకున్నాను. నేను అతడిని మొదటిసారి కలిసినప్పుడు అతడి చుట్టూ ఏదో అడ్డంకి ఉన్నట్టుంది. దాన్ని తొలగించి చూస్తే అతడి గురించి బాగా తెలిసింది” అని ఏబీ డివిలియర్స్ తెలిపాడు. కాగా, 2011–2021 మధ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఏబీ డివిలియర్స్( AB de Villiers) ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కోహ్లీ కీలక బ్యాటర్. ఈ నెల 31 నుంచి ఐపీఎల్-2023 (IPL-2023) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ ను క్రిస్ గేల్ ఇంటర్వ్యూ చేశాడు.

BCCI Central Contracts: పాపం.. తెలుగు కుర్రాడు హనుమ విహారి సహా ఆరుగురికి చోటు దక్కలేదు..

ట్రెండింగ్ వార్తలు