IPL 2021: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. డైరెక్ట్‌గా చూడొచ్చు

యూఏఈలో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రేక్షకులు చూడవచ్చు. మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వెళ్లడానికి అనుమతి ఇస్తుంది

IPL 2021: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. డైరెక్ట్‌గా చూడొచ్చు

Ipl

IPL 2021: యూఏఈలో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రేక్షకులు చూడవచ్చు. మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వెళ్లడానికి అనుమతి ఇస్తుంది ఈసీబీ(ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు). BCCI మరియు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ ఈ విషయాన్ని ప్రకటించాయి. ఐపీఎల్ రెండో దశలో మ్యాచ్‌లను చూసేందుకు ప్రేక్షకులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కి ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేసింది.

ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్(ECB) ప్రధాన కార్యదర్శి ముబాషిర్ ఉస్మాని, స్టేడియంలో ప్రేక్షకులకు అనుమతిపై BCCI మరియు UAE ప్రభుత్వంతో బోర్డు చర్చిస్తుందని చెప్పారు. నివేదిక ప్రకారం, ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల సమయంలో 60శాతం మంది ప్రేక్షకులకు అనుగుణంగా యూఏఈ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అయితే, వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఇస్తారు.

కరోనా కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయిన క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్ యూఏఈలో వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. బీసీసీఐ భావించిన సమయంలో స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తారా..? లేదా అనే విషయంపై పెద్ద చర్చ జరుగుతుంది. దానిపై అప్పట్లో బీసీసీఐ కానీ, యూఏఈ ప్రభుత్వం కానీ స్పందించలేదు. ఐపీఎల్ 2022లో రెండు కొత్త జట్లు చేర్చవచ్చు. రాబోయే ఐపీఎల్ నుంచి 10జట్లు ఐపీఎల్ ఆడుతాయి.