PV Sindhu: పీవీ సింధుకు సీతారామన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం

ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం జరిగింది. మంత్రి కిషన్ రెడ్డి పూలగుచ్ఛం అందించి పీవీ సింధును అభినందించారు. మెగా ఈవెంట్ లో మెడల్ గెలిచాక పీవీ సింధు మంగళవారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టారు.

PV Sindhu: పీవీ సింధుకు సీతారామన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం

Pv Sindhu

PV Sindhu: ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం జరిగింది. మంత్రి కిషన్ రెడ్డి పూలగుచ్ఛం అందించి పీవీ సింధును అభినందించారు. మెగా ఈవెంట్ లో మెడల్ గెలిచాక పీవీ సింధు మంగళవారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టారు. అభిమానుల నుంచి ఘన స్వాగతం అందుకున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను కలిసేందుకు వెళ్లారు. అంతర్జాతీయ వేదికగా వరుసగా రెండో సారి పతకాన్ని అందుకున్న తెలుగు తేజం పీవీ సింధు.. సెమీ ఫైనల్స్ వరకూ ఓటమెరుగకుండా దూసుకెళ్లారు. దేశమంతా ఊహించిన ఆశలను నిజం చేస్తూ.. పతకంతో తిరిగొచ్చారు.

ఆగస్టు 15 వేడుకలకు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత ఒలింపిక్‌ బృందం హాజరుకానున్నారు. ఒలింపిక్ క్రీడాకారులను ప్రధాని మోదీ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవనున్నారు.

అంతకంటే ముందు ఏపీ సీఎం జగన్ ప్రశంసిస్తూ.. వరుసగా పతకాలు సాధించి ఒలింపిక్స్ మెడల్స్‌ను రాష్ట్రానికి తీసుకుని వచ్చిన సింధును చరిత్ర సృష్టించిందని కొనియాడారు. టోక్యో ఒలింపిక్స్‌కి వెళ్లేముందు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్, హాకీ క్రీడాకారిణి రజనిలకు రూ.5 లక్షల చొప్పున నగదు సహాయం అందించి… 2017–22 స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.75 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.30 లక్షలను నగదు ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు.