బాక్సింగ్ డే టెస్టు : 151 పరుగులకే ఆసీస్ ఆలౌట్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్ల దెబ్బకు ఆసీస్ కుప్పకూలింది. ఆస్ట్రేలియా 151 పరుగులకే ఆలౌట్ అయింది.

  • Published By: sreehari ,Published On : December 28, 2018 / 06:06 AM IST
బాక్సింగ్ డే టెస్టు : 151 పరుగులకే ఆసీస్ ఆలౌట్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్ల దెబ్బకు ఆసీస్ కుప్పకూలింది. ఆస్ట్రేలియా 151 పరుగులకే ఆలౌట్ అయింది.

మెల్‌బోర్న్‌: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్ల దెబ్బకు ఆసీస్ కుప్పకూలింది. ఆస్ట్రేలియా 151 పరుగులకే ఆలౌట్ అయింది. 8/0 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది.

కెప్టెన్ క్రీజులో కాసేపు నిలదొక్కుకున్నట్లు కన్పించినప్పటికీ ఆసీస్‌ పరుగులు మాత్రం రాబట్టలేకపోయింది. బుమ్రా ఏ దశలోనూ ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌ను కోలుకోనివ్వలేదు. ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లు సాధించిన పరుగుల్లో అత్యధిక స్కోర్‌ 22. ఈ ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆరు వికెట్లు తీసి తన కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేశాడు. జడేజా రెండు వికెట్లు, ఇషాంత్‌, షమీ చెరొక వికెట్‌ తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 292 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం ఆసీస్‌ను ఫాలోఆన్‌ ఆడించడానికి టీమిండియా నిరాకరించింది. కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది.