Corona Effect IPL : ఐపీఎల్‌పై కరోనా ఎఫెక్ట్‌!

క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ 2021పై తన ఎఫెక్ట్‌ను చూపుతోంది కరోనా. ఇప్పటికే ఐపీఎల్‌కు సంబంధించిన షెడ్యూల్ రెడీ అయిపోయింది. అయితే మ్యాచ్‌లు జరిగే పలు నగరాల్లో ఇప్పుడు కరోనా వ్యాపిస్తోంది.

Corona Effect IPL : ఐపీఎల్‌పై కరోనా ఎఫెక్ట్‌!

Corona Effect On Ipl Matches 2021

Corona Effect on IPL Matches 2021 : క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ 2021పై తన ఎఫెక్ట్‌ను చూపుతోంది కరోనా. ఇప్పటికే ఐపీఎల్‌కు సంబంధించిన షెడ్యూల్ రెడీ అయిపోయింది. అయితే మ్యాచ్‌లు జరిగే పలు నగరాల్లో ఇప్పుడు కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపుతోంది.

దీంతో బీసీసీఐకి ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా అంతకంతకు విజృభిస్తోంది. దీంతో వాంఖడే స్టేడియంలో నిర్వహించే మ్యాచ్‌లపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా స్టేడియంలో పని చేసే ఎనిమిది మంది గ్రౌండ్‌మెన్‌కు కరోనా సోకింది.

దీంతో ఈ స్టేడియంలో ఈ నెల 10 నుంచి 25 మధ్య జరగాల్సిన మ్యాచ్‌ల విషయంలో బీసీసీఐ డైలమాలో పడింది. ఈ నెల 9 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. చెన్నైలో ముంబై-బెంగళూరు మధ్య తొలి మ్యాచ్‌.. 10న ముంబైలో చెన్నై-ఢిల్లీ మధ్య మ్యాచ్‌ జరగనున్నాయి. మ్యాచ్‌లు మొత్తం ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీ, కోల్‌కతాలోనే జరిగేలా బీసీసీఐ షెడ్యూల్‌ ఫిక్స్‌ చేసింది. కానీ ప్రస్తుతం ఈ నగరాలన్నింటిలో కరోనా విజృంభిస్తోంది. ఇందులో అత్యధికంగా ఢిల్లీ, ముంబైలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో నిర్వహించే 10 మ్యాచ్‌లను ఇతర నగరాల్లో నిర్వహించే ఆలోచనలో ఉంది బీసీసీఐ. ప్రస్తుతం బీసీసీఐ ప్రత్యామ్నాయ స్టేడియాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.. మరి ఈ సారైనా బీసీసీఐకి హైదరాబాద్‌ గుర్తుకొస్తుందో లేదో చూడాలి.