Embarrassing Cricket Record: రెండు పరుగులకే ఆలౌట్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డ్ ఇదే!

రెండు పరుగులకే ఆలౌట్ అవడం అంటే వింతగానే ఉంటుంది. కానీ, ఇది నిజంగా జరిగింది. క్రికెట్ చరిత్రలో ఇటువంటి చెత్త రికార్డును ఇప్పటివరకు ఎవరూ క్రియేట్ చేసి ఉండకపోవచ్చు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌‌లో మాత్రం ఇదే జరిగింది.

Embarrassing Cricket Record: రెండు పరుగులకే ఆలౌట్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డ్ ఇదే!

Embarrassing Cricket Record

‘2 Runs’ Match: రెండు పరుగులకే ఆలౌట్ అవడం అంటే వింతగానే ఉంటుంది. కానీ, ఇది నిజంగా జరిగింది. క్రికెట్ చరిత్రలో ఇటువంటి చెత్త రికార్డును ఇప్పటివరకు ఎవరూ క్రియేట్ చేసి ఉండకపోవచ్చు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌‌లో మాత్రం ఇదే జరిగింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు హంటింగ్‌డన్‌షైర్ కౌంటీ లీగ్ మ్యాచ్‌లలో బక్డెన్ క్రికెట్ క్లబ్ మరియు ఫాల్కన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. ఈ మ్యాచ్‌లో బక్డెన్ క్రికెట్ క్లబ్ జట్టు అత్యంత చెత్త బ్యాటింగ్‌తో కేవలం రెండు పరుగులకు ఆలౌటైంది.

బక్డెన్ జట్టులో ఒక్కరంటే ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా సింగిల్ రన్ తీయలేకపోయారు. పది మంది ప్లేయర్లు డకౌట్‌ అయ్యారు. ప్రత్యర్ధి బౌలర్లు అమన్‌దీప్‌సింగ్, హైదర్ అలీ దెబ్బకు బక్డెన్ ప్లేయర్లు క్రీజులోకి వచ్చిన వెంటనే పెవిలియన్‌కు వెళ్లిపోయారు. అమన్‌దీప్ నాలుగు ఓవర్లను మెయిడిన్ చేసి 6 వికెట్లు తీయగా.., అలీ 4.3 ఓవర్లలో రెండు మెయిడిన్ చేసి రెండు వికెట్లు తీశాడు. స్కోర్ బోర్డుపై నమోదైన ఆ రెండు పరుగులు కూడా వైడ్, బై రూపంలోనే వచ్చాయి.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఫహీమ్ సబీర్ భట్టి(65), మురాద్ అలీ (67) హాఫ్ సెంచరీలతో రాణించగా.. 261 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బక్డెన్‌ జట్టు 8.3 ఓవర్లలో 2 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.​ దీంతో ఫాల్కన్స్ జట్టు 258 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ బోర్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.