CM Jagan-Ambati Rayudu: ఐపీఎల్ ట్రోఫీతో సీఎం జ‌గ‌న్‌.. రాయుడితో భేటీ వెనుక కార‌ణ‌మేంటి..?

తెలుగు క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు(Ambati Rayudu) ఇటీవ‌లే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. తాను రాజ‌కీయాల్లోకి రానున్న‌ట్లు తెలిపాడు. ఏపీ రాజ‌కీయాల్లోకి త‌నదైన ముద్ర వేసేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించారు.

CM Jagan-Ambati Rayudu: ఐపీఎల్ ట్రోఫీతో సీఎం జ‌గ‌న్‌.. రాయుడితో భేటీ వెనుక కార‌ణ‌మేంటి..?

CM Jagan-Ambati Rayudu

Jagan-Rayudu: తెలుగు క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు(Ambati Rayudu) ఇటీవ‌లే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. తాను రాజ‌కీయాల్లోకి రానున్న‌ట్లు తెలిపాడు. ఏపీ రాజ‌కీయాల్లోకి త‌నదైన ముద్ర వేసేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించారు. ఏ పార్టీలో చేరే విష‌య‌మై ఇప్ప‌టి వ‌ర‌కు రాయుడు చెప్ప‌లేదు. ఇదిలా ఉంటే.. గురువారం(జూన్ 8న‌) అంబ‌టి రాయుడు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌(CM Jagan)ను క‌లిశాడు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో రాయుడితో పాటు చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్ర‌తినిధులు ముఖ్య‌మంత్రితో భేటీ అయ్యారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ద్వారా క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ఈ సంద‌ర్భంగా రాయుడు సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకువెళ్లారు. అత‌డి సూచ‌న‌ల మేర‌కు ప‌టిష్ట‌మైన కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం రూపొందిస్తుంద‌ని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Ambati Rayudu: ఐపీఎల్‌కు అంబ‌టి రాయుడు గుడ్ బై

మ‌హేంద్ర సింగ్ ధోని నాయ‌క‌త్వంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫైన‌ల్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న సంగ‌తి తెలిసిందే. తాము గెలుచుకున్న ఐపీఎల్ ట్రోఫిని సీఎం జ‌గ‌న్‌కు రాయుడుతో పాటు సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్‌ ఎన్‌.శ్రీనివాసన్ కూతురు రూపా గురునాథ్ చూపించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వారికి అభినంద‌న‌లు తెలిపారు. సీఎస్‌కే స‌భ్యులు ఆటోగ్రాఫ్‌ల‌తో కూడిన జెర్సీని ముఖ్య‌మంత్రికి వారు అంద‌జేశారు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను అంబ‌టిరాయుడు క‌ల‌వ‌డం ఇది రెండోసారి. త‌క్కువ వ్య‌వ‌ధిలో రెండు సార్లు జ‌గ‌న్‌ను రాయుడు క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. దీంతో రాయుడు వైసీపీలో చేరుతాడ‌నే వాద‌న‌లకు బ‌లం చేకూరిన‌ట్లైంది.

Ambati Rayudu: సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన అంబ‌టి రాయుడు.. ఆ పార్టీలోనే చేర‌నున్నాడా..?