Yuzvendra Chahal: రిపోర్టర్‌గా మారిన క్రికెటర్ చాహల్ .. ఇషాన్‌తో ఫన్నీ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే శనివారం రాయ్‌పుర్ వేదికగా జరుగుతుంది. మ్యాచ్‌కు ముందు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రిపోర్టర్‌గా మారాడు. రాయ్‌పుర్‌లోని టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌ను చూపించాడు.

Yuzvendra Chahal: రిపోర్టర్‌గా మారిన క్రికెటర్ చాహల్ .. ఇషాన్‌తో ఫన్నీ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్

Yuzvendra Chahal

Yuzvendra Chahal: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే శనివారం రాయ్‌పుర్ వేదికగా జరుగుతుంది. మ్యాచ్‌కు ముందు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రిపోర్టర్‌గా మారాడు. రాయ్‌పుర్‌లోని టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌ను చూపించాడు. అంతేకాదు.. టీమిండియా ఫుడ్ మెనూలో ఏమోమి వంటకాలు ఉన్నాయో కెమెరాతో చూపించారు. ఇషాన్ కిషన్‌తో ఇంటర్వ్యూ , కెప్టెన్ రోహిత్‌తో సంభాషణ, డ్రెస్సింగ్ రూంలో ఏర్పాట్లును వీడియోలో చాహెల్ చూపించారు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్‌గా మారింది.

India-New Zealand Second ODI : నేడు భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే.. రాయ్ పూర్ స్టేడియంలో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్

సీసీఐ వెబ్‌సైట్‌లోని ‘చాహల్ టీవీ’ యొక్క తాజా ఎపిసోడ్‌లో చాహల్ ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండే సౌకర్యాలు, సౌకర్యవంతమైన సీటింగ్ నుండి, మసాజ్ టేబుల్స్, కొన్ని రుచికరమైన ఆహార పదార్థాలను వివరిస్తూ వీడియో ద్వారా చూపించారు. తొలుత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ వద్దకు వెళ్లిన చాహల్.. అతనితో కొద్దిసేపు ఇంటర్వ్యూ  రూపంలో సరదా సంభాషణ సాగించాడు. అక్కడి నుంచి మసాజ్ టేబుల్‌ వద్దకు వెళ్లాడు. ఇది మా మసాజ్ టేబుల్, ఎవరికైనా బ్యాక్ రిలీఫ్ లేదా ఏ రకమైన ట్రీట్‌మెంట్ కావాలన్నా ఈ టేబుల్ పై ఇవ్వబడుతుంది అంటూ తెలిపాడు. ఈలోపు కెప్టెన్ రోహిత్ శర్మ రావడంతో చాహెల్ కరచాలనం చేశాడు. రోహిత్ స్పందిస్తూ.. అచ్చా ఫ్యూచర్ హై తేరా ( నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది) అని చెబుతూ రోహిత్ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

 

ఆ తరువాత చాహల్.. డ్రస్సింగ్ రూంలో వస్తువులను చూపిస్తూ వంట గదిలోకి వెళ్లాడు. టీమిండియా మెనూను సంబంధించిన వంటకాలను చూపించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంకతో చాహల్ ఇప్పటి వరకు ఒకేఒక్క వన్డే మ్యాచ్ ఆడాడు. అక్కడ ఒక వికెట్ తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కుకూడా పెవిలియన్‌కే పరిమితమయ్యాడు.