MS Dhoni: క్రికెటర్లు జిల్లాను రిప్రజెంట్ చేయడం గర్వకారణం – ధోనీ

తిరువళ్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ రజతోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. క్రికెటర్లు తమ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వపడాలని ధోనీ అన్నారు.

MS Dhoni: క్రికెటర్లు జిల్లాను రిప్రజెంట్ చేయడం గర్వకారణం – ధోనీ

Ms Dhoni

 

 

MS Dhoni: తిరువళ్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ రజతోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. క్రికెటర్లు తమ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వపడాలని ధోనీ అన్నారు.

“జిల్లా అసోసియేషన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న వేడుకకు మొదటిసారి వచ్చాను. నా జిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు రాంచీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. క్రికెటర్లు తమ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వపడాలి. దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ, జిల్లా లేదా పాఠశాల కోసం ఆడకపోతే సాధ్యమయ్యేది కాదని” వివరించాడు.

“దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చినందుకు గర్విస్తున్నాను. కానీ, నా జిల్లా లేదా పాఠశాల కోసం ఆడకపోతే ఇది జరిగేది కాదు” అని ధోని అన్నాడు.

ఐసీసీ మాజీ చైర్మన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్‌తో కలిసి ధోనీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరువల్లార్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఆయన ప్రశంసించారు.

“తిరువల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. 25 సంవత్సరాలకు పైగా ఉంది, కానీ ఈ రోజు కూడా జరుపుకుంటున్నాం. నాకు RN బాబా TDCA సెక్రటరీ చాలా కాలంగా తెలుసు. ఆయనకు మాత్రమే కాదు. అసోసియేషన్‌లోని ఇతరులు కూడా అభినందనలు” అని ధోనీ అన్నారు.