IPL 2020 సీజన్ మొత్తంలో సురేశ్ రైనా తిరిగొస్తాడా… సీఎస్కే సీఈఓ సమాధానమేంటి..

IPL 2020 సీజన్ మొత్తంలో సురేశ్ రైనా తిరిగొస్తాడా… సీఎస్కే సీఈఓ సమాధానమేంటి..

సురేశ్ రైనా జట్టుకు దూరంగా ఉండటం చెన్నై సూపర్ కింగ్స్ ను మరింత వేధిస్తుంది. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కరువవడంతో బ్యాటింగ్ కు నానాతంటాలు పడినా జట్టును గెలిపించుకోలేకపోతున్నాడు కెప్టెన్ ధోనీ. అంబటి రాయుడు గాయం కారణంగా మ్యాచ్ లకు దూరమయ్యాడు. తొలి మ్యాచ్ లో ముంబైపై గెలిచినప్పటికీ తర్వాతి రెండు మ్యాచ్ లలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘోరంగా ఓడిపోయింది.

ఈ సమయంలో రైనా ఉంటే జట్టు పరిస్థితి మరోలా ఉండేదని అంతటా వినిపిస్తుంది. సీజన్ లో ఏడు మ్యాచ్ లు మాత్రమే పూర్తి చేసుకున్న ఐపీఎల్ 2020లో ఇంకా చాలా గేమ్ లు ఆడాల్సి ఉంది. అందుకే రైనాను మళ్లీ తీసుకుంటే చెన్నై గట్టెక్కొచ్చంటూ పలువురు సూచిస్తూ.. చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ను అడుగుతున్నారు.


‘చూడండి. మేం రైనా గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే తనంతట తానే జట్టు నుంచి వెళ్లిపోయాడు. అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. మాకు అభిమానులు, క్రికెట్ వరల్డ్ సపోర్ట్ ఉంది. ఇదొక గేమ్ మాత్రమే. గుడ్ డేస్, బ్యాడ్ డేస్ రెండూ ఉంటాయి. ప్లేయర్లు ఎలా చేయాలో తెలుసుకుంటే.. ముఖాలపై చిరునవ్వులు కనిపిస్తాయి. రాయుడు ఫిట్ గా కనిపిస్తున్నాడు. తర్వాతి గేమ్ లో కమ్ బ్యాక్ ఇస్తాడు’ అని విశ్వనాథన్ చెప్పుకొచ్చారు.