MS Dhoni: అస‌లు నిజాన్ని చెప్పిన చెన్నై కోచ్‌.. మోకాలి గాయంతోనే మ్యాచ్ ఆడిన ధోని

మ‌హేంద్రుడు మోకాలి గాయంతో బాధ‌ప‌డుతున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని చెన్నై సూప‌ర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. మ్యాచ్ అనంత‌రం ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ధోని మోకాలి గాయంతోనే రాజ‌స్థాన్‌తో మ్యాచ్ ఆడిన‌ట్లు చెప్పాడు.

MS Dhoni: అస‌లు నిజాన్ని చెప్పిన చెన్నై కోచ్‌.. మోకాలి గాయంతోనే మ్యాచ్ ఆడిన ధోని

MS Dhoni Injury

MS Dhoni: టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK) కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆట ప‌ట్ల అత‌డి అంకిత‌భావం ఎలాంటిదో అంద‌రికి తెలిసిందే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా స‌రే త‌న కూల్‌నెస్‌తో జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చుతుంటాడు. బుధ‌వారం రాత్రి రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ మ‌హేంద్రుడు(MS Dhoni) విశ్వ‌రూపం చూపించాడు. 17 బంతుల‌ను ఎదుర్కొన్న ధోని ఒక్క ఫోర్‌, 3 సిక్స‌ర్ల‌తో 32 ప‌రుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జ‌ట్టును గెలిపించేందుకు ఆఖ‌రి వ‌ర‌కు య‌త్నించాడు. అయితే సందీప్ శ‌ర్మ చివ‌రి మూడు బంతుల‌ను అద్భుతంగా వేయ‌డంతో రాజ‌స్థాన్ మూడు ప‌రుగుల తేడాతో గెలిచింది.

IPL 2023: గెలుపు సంగ‌తి అటుంచితే.. ఆట‌గాళ్ల‌ను కాపాడుకోవ‌డ‌మే చెన్నైకి పెద్ద ప‌ని

మ‌హేంద్రుడు మోకాలి గాయంతో బాధ‌ప‌డుతున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని చెన్నై సూప‌ర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. మ్యాచ్ అనంత‌రం ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ధోని మోకాలి గాయంతోనే రాజ‌స్థాన్‌తో మ్యాచ్ ఆడిన‌ట్లు చెప్పాడు. మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ప‌లుమార్లు త‌లైవా ఇబ్బంది ప‌డినా అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించాడు. ధోని ఎప్పుడూ ఫిట్‌గా ఉంటాడు అన‌డంలో ఎలాంటి సందేహం అక్క‌ర‌లేదు. టోర్నీ ప్రారంభానికి నెల రోజుల ముందుగానే జ‌ట్టుతో క‌లిసి ప్రాక్టీస్ మొద‌లుపెట్టాడు. త‌రువాతి మ్యాచ్‌కు నాలుగు రోజుల స‌మ‌యం ఉంది. ఈ లోగా ధోని కోలుకుంటాడ‌ని ఆశిస్తున్నాను అని ఫ్లెమింగ్ అన్నాడు.

IPL 2023, CSK Vs RR: చెన్నైను చిత్తు చేసిన రాయ‌ల్స్‌

ఇదిలా ఉంటే.. చెన్నై జ‌ట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే దీప‌క్ చాహ‌ర్‌, ఆల్ రౌండ‌ర్ బెన్‌స్టోక్స్‌ల‌తో పాటు సిమ్ర‌న్‌జీత్ సింగ్‌, ముకేశ్ చౌద‌రీ లు గాయ‌ప‌డ‌డంతో ఇప్ప‌టికే వీరి సేవ‌ల‌ను చెన్నై కోల్పోయింది. రాజ‌స్థాన్‌తో మ్యాచ్‌లో మ‌గాలా చేతికి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌డు ధోని కూడా మోకాలి గాయంతో బాధ‌ప‌డుతుండ‌డం చెన్నై అభిమానుల‌ను కాస్త కంగారు పెట్టే అంశ‌మే.