IPL2023 Final : మ్యాచ్ వాయిదా.. అభిమానుల అగ‌చాట్లు.. ధోనిని చూసేందుకు రైల్వే స్టేష‌న్‌లోనే ప‌డుకున్న చెన్నై ఫ్యాన్స్‌

అహ్మ‌దాబాద్ వేదిక‌గా న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజ‌రాత్ టైటాన్స్‌, చెన్నైసూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా వాయిదా ప‌డే స‌రికి అభిమానులు ఇబ్బందులు ప‌డ్డారు. హోట‌ల్స్‌, ఉండ‌డానికి చోటును వెతుక్కోలేక తిప్ప‌లు ప‌డ్డారు. ఈ క్ర‌మంలో పెద్ద సంఖ్య‌లో అభిమానులు రైల్వే స్టేష‌న్‌కు ఆశ్ర‌యించారు.

IPL2023 Final : మ్యాచ్ వాయిదా.. అభిమానుల అగ‌చాట్లు.. ధోనిని చూసేందుకు రైల్వే స్టేష‌న్‌లోనే ప‌డుకున్న చెన్నై ఫ్యాన్స్‌

CSK Fans Sleep At Railway Station

IPL2023 Final – CSK vs GT : అహ్మ‌దాబాద్ వేదిక‌గా న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజ‌రాత్ టైటాన్స్‌ (Gujarat Titans), చెన్నైసూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన ఐపీఎల్ ఫైన‌ల్ (IPL2023 Final ) మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు మొద‌లైన చిరుజ‌ల్లులు భారీ వ‌ర్షంగా మారింది. ప‌లుమార్లు తెరిపినిచ్చినా కూడా మ‌ళ్లీ వ‌ర్షం కురియ‌డంతో ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే నేటికి(సోమ‌వారానికి) వాయిదా వేశారు. దీంతో మ్యాచ్ చూసేందుకు వ‌చ్చిన వేలాది మంది అభిమానులు నిరాశ చెందారు.

టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని(MS Dhoni)కి ఇదే చివ‌రి మ్యాచ్ అని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో అత‌డి ఆట‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించేందుకు పెద్ద సంఖ్య‌లో అభిమానులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి వ‌చ్చారు. అయితే.. మ్యాచ్ మ‌రుస‌టి రోజుకు వాయిదా ప‌డే స‌రికి వెళ్లి అభిమానులు ఇబ్బందులు ప‌డ్డారు. హోట‌ల్స్‌, ఉండ‌డానికి చోటును వెతుక్కోలేక తిప్ప‌లు ప‌డ్డారు. ఈ క్ర‌మంలో పెద్ద సంఖ్య‌లో అభిమానులు రైల్వే స్టేష‌న్‌కు ఆశ్ర‌యించారు.

IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ సమయంలో వర్షం పడటానికి హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ కారణమా? వైరల్ పోస్టుకు స్పందించిన నటి

అహ్మ‌దాబాద్ రైల్వే స్టేష‌న్‌కు చేరుకున్న అభిమానులు రాత్రి అంతా అక్క‌డే గ‌డిపారు. ఫ్లాట్‌ఫాంపై ప‌డుకుని నిద్ర‌పోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ధోనిపై ఉన్న అభిమానంతోనే వీళ్లంతా అహ్మ‌దాబాద్ వ‌చ్చి ఉంటార‌ని, మ్యాచ్ వాయిదా ప‌డ‌డంతో వెళ్లి, వ‌చ్చేందుకు స‌మ‌యం స‌రిపోక‌పోవ‌డంతో ఇలా చేసి ఉంటార‌ని చెన్నై అభిమానులు కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు.

‘అర్ధరాత్రి మూడు గంటలకు అహ్మ‌దాబాద్‌కు వెళ్లాను. అక్క‌డ చెన్నై జెర్సీ ధ‌రించిన కొందరు అభిమానులు స్టేష‌న్‌లో ప‌డుకుంటే మ‌రికొంద‌రు మెల‌కువ‌గానే ఉన్నారు. వారిని తాను ప‌ల‌క‌రించ‌గా ధోనిని చూసేందుకు త‌మిళ‌నాడు నుంచి వ‌చ్చిన‌ట్లు చెప్పార‌ని’ ఓ నెటీజన్ ట్వీట్ చేశాడు. ఆదివారం వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైన ఫైన‌ల్ నేడు పూర్తిగా జ‌ర‌గాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

IPL 2023 Final: ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఈరోజు కూడా వర్షం కురిస్తే విజేతలను ఎలా నిర్ణయిస్తారో తెలుసా?

ఇదిలా ఉంటే.. మ్యాచ్ ర‌ద్దు అయిన త‌రువాత బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌మ టికెట్ల‌ను జాగ్ర‌త్త‌గా కాపాడుకోల‌ని ప్రేక్ష‌కుల‌కు సూచించింది. సోమ‌వారం ఫిజిక‌ల్ టికెట్లు ఉన్న వారిని మాత్ర‌మే లోనికి అనుమ‌తిస్తామ‌ని చెప్పింది. స‌గం టికెట్ ముక్క‌లు ఉన్నాయ‌ని చెప్పినా, డిజిట‌ల్ కాఫీ మాత్ర‌మే ఉంద‌ని చెప్పినా స్టేడియంలోకి అనుమ‌తించ‌డం జ‌ర‌గ‌ద‌ని  తెలిపింది.