CSK- VS KKR : ఆలస్యంగా నో బాల్ సైరన్, క్రికెటర్ల అసహనం

CSK- VS KKR : ఆలస్యంగా నో బాల్ సైరన్, క్రికెటర్ల అసహనం

Ipl

IPL – 2021 : కోల్ కతా నైట్ రైడర్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మ్యాచ్ మాత్రం మస్తు రంజుగా సాగినా..ఆలస్యంగా నో బాల్ సైరన్ రావడం అభిమానులను ఆశ్చర్యచకితులను చేసింది. ఆడుతున్న క్రికెటర్లకు కూడా ఏమి అర్థం కాలేదు. ఆలస్యంగా నో బాల్ సైరన్ రావడం ఏంటీ ? అని కొంత అసహనం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ లో మొత్తం 26 సిక్సర్లు నమోదు కావడం విశేషం.

అసలు ఏం జరిగింది ?

రవీంద్ర జడేజా 11 ఓవర్ ఆఖరి బంతి వేస్తున్నాడు. అప్పుడు రసెల్‌కు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓవర్ అయిపోయంది. జడేజా ఫీల్డింగ్‌ పొజిషన్‌కు వెళ్లిపోయాడు. కీపర్‌ ధోని కూడా బ్యాట్స్‌మన్‌ స్టైకింగ్‌ చేసే ఎండ్‌లోకి వచ్చేశాడు. మరో బౌలర్ బంతిని తీసుకుని బౌలింగ్ చేయడానికి రెడీ అయిపోయాడు. అప్పుడే నో బాల్ సైరన్ మ్రోగింది. క్రికేటర్లకు ఏమీ అర్థం కాలేదు. మళ్లీ స్టైకింగ్ ఎండ్ మారిపోయింది. కీపర్ ధోని కూడా మళ్లీ అటువైపు నడిచాడు. ఫీల్డర్లు పొజిషన్ మార్చారు. ఆ బంతి ఫ్రీ హిట్ కావడంతో రసేల్ దానిని సిక్స్ గా మార్చాడు.

బౌలర్ ఫీల్డింగ్ పొజిషన్ కు వెళ్లకముందే..నో బాల్ సిగ్నల్ రావాల్సి ఉంటుంది. కానీ..ఈ మ్యాచ్ లో చాలా ఆలస్యమైంది. నో బాల్ అంపైర్ చూడటానికి..అది కన్ఫామ్ చేసుకోవడానికి టైం పట్టి ఉండివచ్చంటున్నారు. నో బాల్‌ సిగ్నల్‌ను థర్డ్‌ అంపైర్‌కు అప్పచెప్పడంతో అది ఆలస్యం అవుతుంది. గతంలో బౌలర్‌ వేసే లైన్‌ క్రాస్‌ నో బాల్‌ ఫీల్డ్‌ అంపైర్ల చేతిలో ఉంటుంది. ప్రత్యేకంగా నో బాల్‌ అంపైర్‌ అని వారికి అప్పచెప్పారో అప్పట్నుంచీ అది ఆలస్యం కావడం తరచు జరుగుతోంది.

2020 ఐపీఎల్‌లో తొలిసారి ‘నోబాల్‌ అంపైర్‌’ అంటూ ప్రత్యేకంగా నియమించిన సంగతి తెలిసిందే. ఇద్దరు ఫీల్డ్‌ అంపైర్లు, థర్డ్‌ అంపైర్, రిజర్వ్‌ అంపైర్‌లకు ఇది అదనంగా ఉంటుంది. కేవలం మ్యాచ్‌లో నో బాల్స్‌నే ప్రత్యేకంగా పరిశీలించడమే అంపైర్‌ పని. ప్రస్తుతం నో బాల్ ఆలస్యంగా చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

Read More : Bezawada : కరోనా కేకలు, ఉల్లిగడ్డల ఆటోలో కోవిడ్ పేషెంట్..