CSKvsMI: చెన్నై టార్గెట్ 156

CSKvsMI: చెన్నై టార్గెట్ 156

సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌కు ముంబై ఇండియన్స్ నామమాత్రపు టార్గెట్‌నే ఇచ్చింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్లు నష్టపోయి 155 పరుగులు బాదింది. ఓపెనర్‌గా దిగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (67; 48బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సులు)తో హై స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ క్వింటాన్ డికాక్(15), ఎవిన్ లూయీస్(32)పరుగులు చేశారు.

మిగిలిన బ్యాట్స్‌మెన్ కృనాల్ పాండ్యా(1), హార్దిక్ పాండ్యా(23), కీరన్ పొలార్డ్(13)పరుగులతో సరిపెట్టుకున్నారు. చెన్నై బౌలర్లు దీపక్ చాహర్(1), ఇమ్రాన్ తాహిర్(1), మిచెల్ శాంతర్(2) వికెట్లు తీయగలిగారు.