CSKvsMI, ప్లే ఆఫ్ 1: మ్యాచ్‌లోని కీలకమైన ఐదుగురు

CSKvsMI, ప్లే ఆఫ్ 1: మ్యాచ్‌లోని కీలకమైన ఐదుగురు

ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో ఎత్తుపల్లాలను చూస్తూ ప్లేఆఫ్ దశకు చేరుకుంది ముంబై ఇండియన్స్. రేసులో నిలవడమే కాక లీగ్ టేబుల్లో టాప్ స్థానాన్ని దక్కించుకుంది. గత సీజన్ మాదిరిగానే చెన్నై సూపర్ కింగ్స్ ఆది నుంచి దూకుడు చూపించడంతో స్థానం గురించి అనుమానమే లేకుండాపోయింది. 

టైటిల్ దక్కించుకునేందుకు మరి కొద్ది మ్యాచ్‌ల దూరమే ఉండడంతో ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ దశలో ఇరు జట్లలోని కీలక ప్లేయర్లను ఓ సారి పరిశీలిస్తే..

లసిత్ మలింగ: శ్రీలంక స్పీడ్ బౌలర్ లసిత్ మలింగ ముంబై ఇండియన్స్‌కు ఓ ఆశాకిరణం. లీగ్‌లో ఇప్పటివరకూ 10మ్యాచ్‌లు ఆడి సున్నా పరుగులతో కట్టడి చేయడంతో పాటు 15వికెట్లు కొల్లగొట్టాడు. ఆ తర్వాతి స్థానంలో బుమ్రా 14మ్యాచ్‌లకు 17వికెట్లు పడగొట్టాడు. ఫుల్ ఫామ్‌లో ఉన్న మలింగ ఆఖరిసారి ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో 4ఓవర్లు బౌలింగ్ వేసి 3వికెట్లు తీశాడు. 

క్వింటన్ డికాక్: ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ డికాక్.. ఆరంభం నుంచి జట్టుకు దన్నుగా నిలిచి టీం టాపర్‌గా నిలిచాడు. 14 మ్యాచ్‌లలో 492పరుగులు చేసి సీజన్లోనే టాప్ స్కోర్ చేసిన వాళ్లలో 4వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 

హర్భజన్ సింగ్: చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ స్పిన్నర్ భజ్జీ… బౌలింగ్‌లో ప్రధాన బలం. 8మ్యాచ్‌లు ఆడితే కేవలం 1పరుగు మాత్రమే ఇచ్చి 13వికెట్లు పడగొట్టాడు. క్వాలిఫైయర్ 1లో మరోసారి మెరిసేందుకు సిద్ధమవుతున్నాడు. చిదంబరం స్వామి స్టేడియం వేదికగా మే7న ముంబై ఇండియన్స్‌పై తలపడనున్నాడు. 

ఫాఫ్ డుప్లెసిస్: బౌలింగ్‌లో.. ఫీల్డింగ్‌లో ఎన్ని లోపాలున్నా.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌తో  అధిగమించేస్తుంది. జట్టుకు ప్రధానంగా పరుగులు తెచ్చిపెట్టే స్టార్ బ్యాట్స్‌మెన్‌లలో దక్షిణాఫ్రికా ప్లేయర్ డుప్లెసిస్ ఒకరు. అతని ఇన్నింగ్స్ చూసి జట్టులో మిగిలిన ప్లేయర్లు ప్రోత్సాహంగా ఫీలవుతారు. 

హార్దిక్ పాండ్యా: సీజన్ మొత్తంలో ఆల్ రౌండర్ ప్రదర్శనలో అదరగొడుతున్న ప్లేయర్ హార్దిక్ పాండ్యా. ఓ మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు. 14 మ్యాచ్‌లు ఆడి బ్యాటింగ్‌లో 380పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 14వికెట్లు తీయగలిగాడు. 

ఈ కీలకమైన వారితోపాటు మిగిలిన ప్లేయర్ల సంగతి తెలిసిందే. సమయానికి తగ్గట్టు మెరిసి జట్టును విజయతీరాలకు చేర్చుతారు. చెన్నైలోని చిదంబరం స్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ 7:30గంటలకు ఆరంభం కానుంది.