CSKvsMI: ముంబై టార్గెట్ 132

CSKvsMI: ముంబై టార్గెట్ 132

చెన్నై సూపర్ కింగ్స్‌ను ముంబై బౌలర్లు ఘోరంగా కట్టడి చేశారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌కు 132 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. ఆరంభం నుంచి సూపర్ కింగ్స్‌ను ఒత్తిడికి గురిచేయడంతో స్కోరు బోర్డు నత్తనడకన సాగింది. ఓపెనర్లు డుప్లెసిస్(6), షేన్ వాట్సన్(10)పరుగులకే సరిపెట్టకోవడంతో సురేశ్ రైనా కూడా వారి బాటలోనే (5)పరుగులకే పరిమితమయ్యాడు. 

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మురళీ విజయ్(26; 26 బంతుల్లో 3ఫోర్లు చేయడంతో కొద్ది సేపు వికెట్లు కాపాడుకోగలిగారు. మరో ఎండ్‌లో బ్యాటింగ్‌కు దిగిన అంబటి రాయుడు(42; 37బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు) రాణించాడు. విజయ్ అవుట్ తర్వాత ధోనీ(37; 29బంతుల్లో 3సిక్సులు) బ్యాటింగ్‌కు దిగి కెప్టెన్ ఇన్నింగ్స్ అందించాడు.