WTC Final 2023: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ గదతో భారత్, ఆస్ట్రేలియా కెప్టెన్లు
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌కు అంతా సిద్దమైంది. లండన్‌లోని ఓవల్ వేదికగా బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి.

Rohit Sharma and Pat Cummins with WTC Trophy
WTC Final: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్‌కు అంతా సిద్దమైంది. లండన్‌లోని ఓవల్ వేదికగా బుధవారం నుంచి భారత్(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరు జట్ల కెప్టెన్లతో ఐసీసీ(ICC) ఓ ఫోటో సెషన్‌ను నిర్వహించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ గదను న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ తీసుకొని రాగా.. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma), ఆస్ట్రేలియా సారథి కమిన్స్(Pat Cummins) దానితో ఫోటోలకు ఫోజులిచ్చారు.
అనంతరం ఆసీస్ కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ.. టెస్టు ఛాంపియన్ షిప్ గదను అందుకోవడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఇక్కడ వరకు రావడానికి ఎంతో శ్రమించామని, చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇంటా, బయట కష్టపడి విజయాలు సాధించడంతో ఇక్కడి దాకా వచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు. గత కొన్నాళ్లుగా తమ జట్టు అద్భుతంగా రాణిస్తోందని అదే ఊపులో ఫైనల్ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు.
Rinku Singh: రింకూ సింగ్ సిక్స్ ప్యాక్.. శుభ్‌మన్ గిల్ సోదరి కామెంట్
View this post on Instagram
ఇది చాలా కఠినమైన టోర్నమెంట్. మేము ఇక్కడికి చేరుకోవడానికి రెండేళ్ల పాటు నిలకడైన క్రికెట్ ఆడినట్లు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలు సమిష్టిగా రాణించడంతోనే ఇక్కడ వరకు వచ్చినట్లు చెప్పాడు. ఫైనల్ మ్యాచ్ తటస్థ వేదికపై ఆడడం ఇరు జట్లకు సవాల్‌తో కూడుకున్నదేనన్నాడు. ఫైనల్ మ్యాచ్ కోసం జట్టు తీవ్రంగా శ్రమిస్తోందని, ఆఖరి మ్యాచ్‌లో సైతం అన్ని విభాగాల్లో సత్తా చాటి విజేతగా నిలుస్తామనే విశ్వాసాన్ని రోహిత్ శర్మ వ్యక్తం చేశాడు.
ప్రైజ్‌మనీ ఎంతంటే..?
డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతగా నిలిచిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ అంటే భారత కరెన్సీలో రూ.13.24 కోట్లు దక్కనుంది. రన్నరప్‌కు 8 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.6.5 కోట్లు అందనుంది.
ఐదు రోజుల పాటు సాగే ఈ మ్యాచ్‌లో వర్షం వల్ల ఏదైన రోజు ఆట రద్దు అయితే.. రిజర్వ్ డే రోజున నిర్వహించే వీలుంది. జూన్ 12 రిజర్వ్ డేగా ఉంది. ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లోనూ చూడొచ్చు.