MS Dhoni : క్రికెట్ కోచింగ్ వైపు ధోని – కనేరియా

భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని, వ్యాఖ్యాతగా కాకుండా కోచ్ గా వెళ్తారని పాకిస్థాన్ క్రికెటర్ డానిష్ కనేరియా అన్నారు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడిన కనేరియా.. ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోని త్వరలో కోచింగ్ రంగంలోకి అడుగుపెడతారని తెలిపారు. తన ప్రతిభతో కోచింగ్ లో అనేక మైలురాళ్లను ఆదుకుంటారని తెలిపారు.

MS Dhoni : క్రికెట్ కోచింగ్ వైపు ధోని – కనేరియా

Ms Dhoni

MS Dhoni : టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, వ్యాఖ్యాతగా కాకుండా కోచ్ గా వెళ్తారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అన్నారు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడిన కనేరియా.. ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోని త్వరలో కోచ్ గా అడుగుపెడతారని తెలిపారు. తన ప్రతిభతో కోచింగ్ లో అనేక మైలురాళ్లను ఆదుకుంటారని పేర్కొన్నారు.

గొప్ప క్రికెట్ కోచ్ గా ధోని నిలుస్తారని తెలిపారు డానిష్. కాగా 2000 నుంచి 2010 వరకు డానిష్ పాకిస్థాన్ జట్టు తరపున ఆడారు. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో క్రికెట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి.. ఔత్సాహికులకు కోచింగ్ ఇస్తున్నారు.

ఇక ధోని విషయానికి వస్తే.. 2004లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ధోని తన ఆటతీరుతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వన్డే, టెస్ట్, ప్రపంచ కప్పులతోపాటు ఐసీసీ ట్రోఫీని భారత్ కు అందించారు ధోని. 2019 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ లో ధోని తన అంతర్జాతీయ చివరి వన్డే మ్యాచ్ ఆడారు.

2020 ఆగస్టు 15న సడెన్ గా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. కాగా ప్రస్తుతం ధోని ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.