David Warner: వార్నర్ ఇన్‌స్టా పోస్టు.. హోటల్ గదికే పరిమితం.. ఎందుకలా

ఐపీఎల్ టోర్నీలో డేవిడ్ వార్నర్ కు అవమానం జరిగిందని, అలా చేయడం వెనుక ఏదో కారణాలు ఉన్నాయంటున్నారు ప్రముఖులు.

David Warner: వార్నర్ ఇన్‌స్టా పోస్టు.. హోటల్ గదికే పరిమితం.. ఎందుకలా

David Warner

David Warner: ఐపీఎల్ టోర్నీలో డేవిడ్ వార్నర్ కు అవమానం జరిగిందని, అలా చేయడం వెనుక ఏదో కారణాలు ఉన్నాయంటున్నారు ప్రముఖులు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బలం చేకూర్చి.. వ్యక్తిగతంగానూ క్రీడాభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్న డేవిడ్ వార్నర్ మైదానంలో కనిపించడం లేదు. లీగ్ మ్యాచ్ లను చూస్తున్నట్లుగా ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.

దాంతో పాటు పెట్టిన టెక్స్ట్ మెసేజ్ పోస్టు వైరల్ అయింది. ఏటా ప్రతి సీజన్ లో హిట్టర్ గా కనిపించే వార్నర్ ను పక్కకు పెట్టి ఆ స్థానంలో జాసన్ రాయ్ ను దించారు. కెప్టెన్సీకి కూడా నోచుకోకపోవడంతో హోటల్ గదిలోనే ఉండిపోతున్నాడు. దీనిపై అభిమానులతో పాటు విమర్శకుల్లోనూ చర్చ మొదలైంది. దానికి తోడు ఇన్‌స్టా వేదికగా వార్నర్ పెట్టిన పోస్టు అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది.

‘మీ ముందు నిజంగా ఎవరు ప్రవర్తిస్తున్నారని కాదు.. మీ వెనుక కూడా మీ గురించి అలా మాట్లాడే వాళ్ల వారి గురించి’ అంటూ ఓ కోట్‌ను వార్న‌ర్ పోస్ట్ చేశాడు.

………………………………………: ఒకేసారి 6 సినిమాలు.. మూవీ లవర్స్‌కి పండగే!

ప్ర‌ముఖ స్పోర్ట్స్ అన‌లిస్ట్ బోరియా మజుందార్ ట్విట‌ర్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌పై తీవ్రంగా మండిప‌డ్డారు. అత‌న్ని స్టేడియానికి కూడా రానీయ‌క‌పోవ‌డంపై, క‌నీసం 18 మందిలో ఉండే అర్హ‌త అత‌నికి లేదా? అత‌నికి డ్రింక్స్ అయినా పంపండి. టీమ్‌కు ఇమేజ్ తీసుకొచ్చే ప్లేయ‌ర్ అత‌డు. అలాంటి ప్లేయ‌ర్‌ను హోటల్‌కే ప‌రిమితం చేసి మీ ఫ్యాన్ బేస్ కోల్పోతున్నారు.