IPL 2022: రాబోయే సీజన్ కొత్త జట్టుకు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్!!

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కొత్త జట్లకు కెప్టెన్ గా రావడానికి రెడీగా ఉన్నాడు. 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ఆడింది 8మ్యాచ్ లే.

IPL 2022: రాబోయే సీజన్ కొత్త జట్టుకు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్!!

david-warner-

IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రాబోయే సీజన్ లో కొత్త జట్లకు కెప్టెన్ గా రావడానికి రెడీగా ఉన్నాడు. ప్రస్తుత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ఆడింది 8మ్యాచ్ లే. 2016లో ఫ్రాంచైజీకి ఐపీఎల్ టైటిల్ తెచ్చిపెట్టిన వార్నర్ సడెన్ గా పక్కకుపెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. లీగ్ మ్యాచ్ లతో సరిపెట్టుకుని ఇంటి బాట పట్టడంతో వార్నర్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు.

కొద్ది రోజుల ముందే ఐపీఎల్ 2022కు మరో రెండు టీంలు వస్తాయని చెప్పింది బీసీసీఐ. అయితే దీని కోసం వేలం జరగనుండగా అది అక్టోబర్ 25తో ముగుస్తుంది. ఎలాగూ లీగ్ మ్యాచ్ లలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ వార్నర్ ను పక్కకుపెట్టేసింది. ఇక వేలానికి వదిలిపెట్టేందుకు కూడా రెడీగానే ఉండటంతో వార్నర్ కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు.

తాను చాలా ఎనర్జిటిక్ గా ఉంటానని, కొత్త ఉత్సాహంతో ఉంటానని ఆ అవకాశం వస్తే అందుకోవడానికి రెడీగా ఉన్నానని అంటున్నాడు.

……………………………………………: ఇండియాలోనే అత్యంత ఖరీదైన స్కూటర్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ

‘కొత్త బాధ్యతలు తీసుకోవడాన్ని ఎంజాయ్ చేస్తాను. నన్ను బెటర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో లీడర్లతో కలిసి పనిచేశా. రషీద్ ఖాన్ అఫ్ఘాన్ జట్టు కెప్టెన్, కేన్ విలియమ్సన్, జాసన్ హోల్డర్లు వీరు కూడా. వారితో పనిచేయడం నాలెడ్జ్ పంచుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. సాలిడ్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. అలా ఆడితేనే బెస్ట్ లీడర్ గా ఎదుగుతాం’

‘ఒకవేళ నన్నే కొత్త జట్టుకు కెప్టెన్ గా తీసుకుంటే.. పనిచేయడానికి చాలా ప్యాషనేట్ గా ఉన్నా. విజయం సాధించామంటే అది అనుభవించడానికి అందరూ అర్హులే’ అని వార్నర్ ముగించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ (డేర్‌డెవిల్స్)తో ఐదేళ్ల పాటు కొనసాగిన వార్నర్.. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరి 2015లో కెప్టెన్ అయిపోయాడు. 2016లో 848పరుగులు చేసి జట్టును ముందుకు నడిపాడు.

ఐపీఎల్ మొత్తంలో వార్నర్ ఆడింది 150 మ్యాచ్ లు అయితే చేసింది 5వేల 449 పరుగులు. అందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. 2021 సీజన్లోనే కాస్త ఫామ్ నుంచి బయట ఉన్నాడు. 8మ్యాచ్ లకు ఆడింది 195 పరుగులే.