మ్యాచ్ మధ్యలో వార్నర్ బుట్టబొమ్మ డ్యాన్స్

మ్యాచ్ మధ్యలో వార్నర్ బుట్టబొమ్మ డ్యాన్స్

david-warner-

David Warner: ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ మరోసారి బుట్టబొమ్మ డ్యాన్స్ తో మెప్పించాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న వార్నర్ బుట్టబొమ్మ డ్యాన్స్ వేశాడు. మహమ్మారి ప్రభావానికి మ్యాచ్ లన్నీ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత తొలి సారి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా, టీమిండియాలు భారీ ఆదరణ దక్కించుకున్నాయి.

ఈ క్రమంలో ఫ్యాన్స్ కోసం వార్నర్ తెలుగు సాంగ్ బుట్ట బొమ్మ స్టెప్ వేసి చూపించాడు. అంతటి పాపులర్ ట్రాక్ పై వేసిన డ్యాన్స్ స్టెప్పులు వేయడం తొలిసారేం కాదు. ఈ సంవత్సర ఆరంభంలో భార్యతో కలిసి టిక్ టాక్ వీడియోల్లో ఎక్కువగా కనిపించిన వార్నర్.. మరోసారి ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడిన మ్యాచ్ లోనూ బుట్టబొమ్మ స్టెప్పులేశాడు.



తొలి వన్డేలో టీమిండియా 66పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆస్ట్రేలియా బౌలింగ్ కు నిలబడలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా.. టీమిండియాకు భారీ టార్గెట్ నిర్దేశించింది. స్మిత్, ఫించ్ లు రెచ్చిపోయి ఆడిఅద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫించ్(114), స్మిత్(105)లకు వార్నర్(69), మ్యాక్స్‌వెల్ (45)తోడవడంతో జట్టు స్కోరు పరుగులు పెట్టింది. ఫలితంగా టీమిండియాకు 375పరుగుల టార్గెట్ నిర్దేశించారు.

చేధనలో తడబడ్డ టీమిండియా 8వికెట్లు నష్టపోయి 308పరుగులు మాత్రమే చేయగలిగింది. పాండ్యా(90) వీరోచిత పోరాటం జట్టు విజయతీరాలకు చేర్చలేకపోయింది. ధావన్(74) చక్కటి ఇన్నింగ్స్ నెలకొల్పాడు. మూడు వన్డేల సిరీస్ లో ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగా ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది.