David warner: కెప్టెన్సీ తొల‌గించి, జ‌ట్టులో చోటివ్వ‌కుండా, డ్రింక్స్‌ మోపించి.. అవ‌మానించిన జ‌ట్టు పై వార్న‌ర్ గెలుపు సంబ‌రాలు

ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు 7 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. త‌న జ‌ట్టు గెలుపొంద‌గానే వార్న‌ర్ సెల‌బ్రేష‌న్స్ మామూలుగా లేవు. వార్న‌ర్ చేసుకున్న సంబురాల‌ను చూస్తుంటే ఎస్ఆర్‌హెచ్‌పై గెల‌వాల‌న్న క‌సి అత‌డికి ఏ రేంజ్‌లో ఉందో అర్థం అవుతుంది.

David warner: కెప్టెన్సీ తొల‌గించి, జ‌ట్టులో చోటివ్వ‌కుండా, డ్రింక్స్‌ మోపించి.. అవ‌మానించిన జ‌ట్టు పై వార్న‌ర్ గెలుపు సంబ‌రాలు

David warner Winning celebrations ( pic- DC twitter)

David warner: డేవిడ్ వార్న‌ర్‌.. ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. క్రికెట్ గురించి కాస్త ప‌రిజ్ఞానం ఉన్నా స‌రే ఈ ఆట‌గాడి గురించి తెలుస్తుంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)లో ప్ర‌స్తుతం ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాగా..స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sunrisers Hyderabad) త‌న‌ను అవ‌మాన‌క‌ర రీతిలో జ‌ట్టు నుంచి సాగ‌నంపిన తీరుపై ఎట్ట‌కేల‌కు డేవిడ్ వార్న‌ర్ ప్ర‌తీకారం తీర్చుకున్నాడు.

సోమ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు 7 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. త‌న జ‌ట్టు గెలుపొంద‌గానే వార్న‌ర్ సెల‌బ్రేష‌న్స్ మామూలుగా లేవు. వార్న‌ర్ చేసుకున్న సంబురాల‌ను చూస్తుంటే ఎస్ఆర్‌హెచ్‌పై గెల‌వాల‌న్న క‌సి అత‌డికి ఏ రేంజ్‌లో ఉందో అర్థం అవుతుంది. ఢిల్లీ గెల‌వ‌గానే వార్న‌ర్ గాల్లోకి ఎగురుతూ గంతులు వేశాడు. త‌న జ‌ట్టు ఆట‌గాళ్లతో క‌లిసి మైదానం మొత్తం తిరుగుతూ నానా హంగామా చేశాడు. ఈ సీజ‌న్‌లో ఢిల్లీ జ‌ట్టు విజ‌యం సాధించింది కేవ‌లం రెండు మ్యాచుల్లోనే అయిన‌ప్ప‌టికీ కప్పు గెలిచాం అన్న రేంజ్‌లో వార్న‌ర్ సెల‌బ్రేట్ చేసుకున్నాడు.

IPL 2023 DC Vs SRH : చతికిలపడిన సన్ రైజర్స్.. ఢిల్లీ కేపిటల్స్ గెలుపు

2015 నుంచి 2021 వ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు వార్న‌ర్ ప్రాతినిధ్యం వ‌హించాడు. అత‌డి కెప్టెన్సీలోనే 2016లో స‌న్‌రైజ‌ర్స్ ఐపీఎల్ విజేత‌గా నిలిచింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రోసారి స‌న్‌రైజ‌ర్స్ క‌ప్పును ముద్దాడ‌లేదు. ఇదిలా ఉంటే.. 2021 సీజ‌న్‌లో జ‌ట్టు మేనేజ్‌మెంట్ తో వార్న‌ర్ విభేదించాడు. దీంతో అత‌డిని కెప్టెన్సీ నుంచి తొల‌గించింది. ఆ త‌రువాత క‌నీసం తుది జ‌ట్టులో కూడా చోటు ద‌క్క‌కుండా చేశారు. ఆ సీజ‌న్‌లో కొన్ని మ్యాచుల్లో మైదానంలో ఆడుతున్న ఆట‌గాళ్ల‌కు వార్న‌ర్ డ్రింక్స్‌కు కూడా తీసుకువెళ్లి ఇచ్చాడు. త‌న‌ను ఎంత‌లా అవ‌మానించిన‌ప్ప‌టికి వార్న‌ర్ ఆ స‌మ‌యంలో ఒక్క మాట కూడా అన‌లేదు.

ఆ త‌రువాత వేలానికి అత‌డిని హైద‌రాబాద్ జ‌ట్టు విడిచిపెట్టింది. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఈ విధ్వంస‌క‌ర వీరుడిని సొంతం చేసుకుంది. రెగ్యుల‌ర్ కెప్టెన్ రిష‌బ్ పంత్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి ఐపీఎల్ 2023 సీజ‌న్ మొత్తానికి దూరం కావ‌డంతో అత‌డి స్థానంలో ఢిల్లీ మేనేజ్‌మెంట్ వార్న‌ర్‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అత‌డి సార‌థ్యంలోని ఢిల్లీ ఈ సీజన్‌లో వ‌రుస‌గా ఐదు మ్యాచ్‌లు ఓడిన‌ప్ప‌టికి గెలుపు బాట ప‌ట్టింది. వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ క్ర‌మంలో తన పట్ల అగౌరవంగా వ్యవహరించిన స‌న్‌రైజ‌ర్స్‌ను ఓడించడం వార్నర్ కు అంతులేని ఆనందాన్ని ఇచ్చిన‌ట్లుగా క‌నిపించింది.

David Warner: హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన డేవిడ్ వార్న‌ర్‌