David Warner: హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన డేవిడ్ వార్న‌ర్‌

ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ పేరిట ఉన్న ఓ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు.

David Warner: హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన డేవిడ్ వార్న‌ర్‌

Warner shatters Rohit record

David Warner: ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్(David Warner) ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అర్థ‌శ‌త‌కాల‌తో చెల‌రేగుతున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌(Kolkata Knight Riders)తో జ‌రిగిన మ్యాచ్‌లో త‌న‌దైన శైలిలో దూకుడుగా ఆడుతూ 41 బంతుల్లో 7 ఫోర్ల‌తో 57 ప‌రుగులు చేశాడు. ఈ సీజ‌న్‌లో వార్న‌ర్‌కు ఇది నాలుగో అర్ధ‌శ‌త‌కం. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో అర్ధ‌శ‌త‌కం సాధించిన వార్న‌ర్.. హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) పేరిట ఉన్న ఓ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. వార్న‌ర్ కేకేఆర్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు 26 మ్యాచులు ఆడి 1,075 ప‌రుగులు చేశాడు. అంత‌క‌ముందు ఈ రికార్డు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(32 మ్యాచుల్లో 1040) పేరిట ఉండేది. వీరిద్ద‌రి త‌రువాత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ (850), చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ ఆట‌గాడు సురేష్ రైనా(829) జాబితాలో ఉన్నారు.

IPL 2023, DC vs KKR: ఎట్ట‌కేల‌కు బోణీ కొట్టిన ఢిల్లీ.. లో స్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌క‌తాపై విజ‌యం

ఐపీఎల్‌లో వార్న‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు 168 మ్యాచ్‌లు ఆడాడు. 42.23 స‌గ‌టుతో 6,166 ప‌రుగులు చేశాడు. ఇందులో నాలుగు శ‌త‌కాలు, 59 అర్థ‌శ‌కాలు ఉన్నాయి. ఈ లీగ్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన మూడో ఆట‌గాడిగా వార్న‌ర్ కొన‌సాగుతున్నాడు. అత‌డి క‌న్నా ముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ లు మాత్రమే ఉన్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 127 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ల‌క్ష్యాన్ని ఢిల్లీ 19.2 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో డేవిడ్ వార్న‌ర్ (57; 41 బంతుల్లో 11 ఫోర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు.

IPL 2023: ఢిల్లీ vs కోల్‌క‌తా మ్యాచ్‌కు స్పెష‌ల్ గెస్ట్‌.. ఐఫోన్స్‌ ఇంటికి పంపాలంటూ నెటిజ‌న్ల కామెంట్లు