David Warner on captaincy: నాకు క్రికెట్ కన్నా నా కుటుంబమే ముఖ్యం: వార్నర్ ఘాటు వ్యాఖ్యలు

‘నాకు క్రికెట్ కన్నా నా కుటుంబమే చాలా ముఖ్యం’’ అని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించకుండా తనపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసేందుకు సమీక్ష జరపాలని ఇటీవల ఆయన అప్పీలు చేసుకున్నాడు. అయితే, ఆ అప్పీలును ఉపసంహరించుకుంటున్నట్లు రివ్యూ ప్యానెల్ కి ఆయన ఇవాళ లేఖ రాసి అందరినీ ఆశ్చర్యపర్చాడు.

David Warner on captaincy: నాకు క్రికెట్ కన్నా నా కుటుంబమే ముఖ్యం: వార్నర్ ఘాటు వ్యాఖ్యలు

David Warner on captaincy

David Warner on captaincy: ‘‘నాకు క్రికెట్ కన్నా నా కుటుంబమే చాలా ముఖ్యం’’ అని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించకుండా తనపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసేందుకు సమీక్ష జరపాలని ఇటీవల ఆయన అప్పీలు చేసుకున్నాడు. అయితే, ఆ అప్పీలును ఉపసంహరించుకుంటున్నట్లు రివ్యూ ప్యానెల్ కి ఆయన ఇవాళ లేఖ రాసి అందరినీ ఆశ్చర్యపర్చాడు.

తాను నేరస్థుడిని కాదని, కనీసం అప్పీలు చేసుకునే హక్కు ఉండాలంటూ ఇటీవలే వ్యాఖ్యలు చేసిన డేవిడ్ వార్నర్ ఇప్పుడు అప్పీలు చేసుకునే అవకాశాన్ని వదులుకోవడం గమనార్హం. తాను ఇవాళ రివ్యూ ప్యానెల్ కు రాసిన లేఖను డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ లోనూ పోస్ట్ చేశాడు. 2018 మార్చిలో తన సారథ్యంపై ఆస్ట్రేలియా క్రికెట్ శాశ్వత నిషేధం విధించిన విషయాన్ని ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను వార్నర్ గుర్తు చేసుకున్నాడు.

ఆ సమయంలో దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరిగిన మూడో టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా జట్టు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిందని ఆరోపణలు రావడంతో తనపై అనేక విమర్శలు వచ్చాయని చెప్పాడు. ఆ సమయంలో తన భార్య క్యాండిస్, తన ముగ్గురు పిల్లలు ఇవి మయీ, ఇండి రయీ, ఇస్లా రోజ్ తనకు పూర్తిగా మద్దతుగా నిలిచారని అన్నాడు. వారే తన ప్రపంచమని చెప్పాడు.

అప్పుడు జరిగిన టెస్టు నుంచి ఇప్పటివరకు తనపై కెప్టెన్సీ విషయంలో ఉన్న నిషేధాన్ని ఎన్నడూ ఎత్తేయలేదని అన్నాడు. నిబంధనల్లో సవరణలు చేయాలని చాలా కాలంగా కోరుతున్నానని గుర్తుచేశాడు. చివరకు 2022 నవంబరు 21న క్రికెట్ ఆస్ట్రేలియా తమ నిబంధనల్లో పలు సవరణలు చేసి, క్రికెటర్ల దీర్ఘకాల నిషేధాలపై అప్పీలు చేసుకునే వీలు కల్పించిందని చెప్పాడు.

Refund Wrong UPI Transaction : మీరు పొరపాటున మరో UPI IDకి డబ్బులను పంపారా? ఆందోళన అక్కర్లేదు.. ఇలా ఈజీగా రీఫండ్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

దీంతో మంచి అవకాశం వచ్చిందని అనుకున్నానని తెలిపాడు. తన కెప్టెన్సీపై ఉన్న నిషేధం ఎత్తివేత కోసం నవంబరు 25న క్రికెట్ ఆస్ట్రేలియాకు అప్పీల్ చేసుకున్నానని అన్నాడు. అయితే, దాన్ని పరిశీలించి, విచారించే స్వతంత్ర సమీక్ష ప్యానెల్, దాని సహాయక మండలి తీరు బాగోలేదని చెప్పారు. సమీక్ష విధాన ప్రక్రియను ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నారని విమర్శించారు.

తన దరఖాస్తును పరిశీలించడంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పాడు. ఈ పరిణామాలతో తన కుటుంబంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపాడు. తనపై రివ్యూ ప్యానెల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని అన్నాడు. క్రికెట్ మురికిని వదిలించే లాండ్రీలో తన కుటుంబాన్ని వాషింగ్ మిషన్ చేసేందుకు తాను సిద్ధంగా లేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)