బాక్సింగ్ డే టెస్టు: ఆచితూచి అడుగేస్తున్న టీమిండియా

బాక్సింగ్ డే టెస్టు: ఆచితూచి అడుగేస్తున్న టీమిండియా

Boxing Day: బోర్డర్‌ గావస్కర్‌ ట్రోపీలో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా ఆచితూచి ఆడుతుంది. సున్నా పరుగుల వద్ద తొలి వికెట్‌గా మయాంక్ అగర్వాల్ (0) కోల్పోయినప్పటికీ భారత బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనవకుండా ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు.

అంతకంటే ముందు జరిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు చెలరేగారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు తొలి షాక్ ఇచ్చాడు టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా. ఓపెనర్‌ బర్న్స్‌ను డకౌట్‌గా వెనక్కుపంపాడు. ఫలితంగా ఆసీస్‌ 10 పరుగుల వద్ద మొదటి వికెట్‌ కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత వచ్చిన మార్నస్‌ లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ ఇన్నింగ్స్‌ను నెలకొల్పే ప్రయత్నం చేసేందుకు యత్నించాడు.

ఈ జోడి బలపడుతున్న సమయంలో బౌలింగ్‌కు వచ్చిన రవిచంద్రన్‌ అశ్విన్‌ వేడ్‌ను 30 పరుగుల వద్ద ఔట్‌ చేశాడు. ఫలితంగా ఆసీస్‌ 35 పరుగుల వద్ద రెండో వికెట్‌ నష్టపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ క్రీజులో కుదురుకోవడానికి కాస్త ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఆ దశలో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్‌ స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. దీంతో ఆసీస్‌ 38 పరుగులకే మూడు వికెట్లు నష్టపోయింది.

లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఆసీస్‌ 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. లబుషేన్‌ 26 పరుగులు, ట్రెవిస్‌ హెడ్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆ తర్వాత అదే కొనసాగించిన బౌలర్లు ఆస్ట్రేలియాను ఆల్ అవుట్ చేశారు. సిరాజ్ బౌలింగ్ లో 48పరుగులు చేసిన లబుషేన్ శుభ్ మన్ కు క్యాచ్ ఇచ్చి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత స్వల్ప విరామంతో హెడ్ (38), గ్రీన్ (12), పైనె (13), కమిన్స్ (9), స్టార్క్ (7), లైన్(20)లు అవుట్ అవగా చివరిగా క్రీజులో హాజిల్ వుడ్(4)పరుగులతో ఉన్నారు.

మెల్‌బౌర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు క్రికెట్ తొలి రోజే అవుట్ అయిన లిస్టులో ఆస్ట్రేలియా వివరాలిలా ఉన్నాయి.
198(68.1) vs WI 1981/82
141(54.4) vs Eng 1986/87
219(74.5) vs WI 1996/97
98(42.5) vs Eng 2010/11
195(72.3) vs Ind 2020/21

భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య ఇది 100వ టెస్ట్‌ మ్యాచ్‌ కావడం విశేషం. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో, భారత్‌ 28 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మిగతా 27 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఒక టెస్టు ‘టై’గా ముగిసింది.