IPL 2023: గెలుపు మ‌త్తులో ఉన్న వార్న‌ర్‌కు భారీ షాక్‌

మ్యాచ్ గెలిచిన త‌రువాత ఢిల్లీ జ‌ట్టు కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ చేసుకున్న సెల‌బ్రేష‌న్స్ మామూలుగా లేవు. గెలుపు మ‌త్తులో ఉన్న వార్న‌ర్‌కు ఐపీఎల్ నిర్వాహ‌కులు షాకిచ్చారు. స్లో ఓవ‌ర్‌రేటు కార‌ణంగా రూ.12లక్ష‌ల ఫైన్ ప‌డింది.

IPL 2023: గెలుపు మ‌త్తులో ఉన్న వార్న‌ర్‌కు భారీ షాక్‌

David Warner fined Rs.12 lakh

IPL 2023: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా సోమ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(Sunrisers Hyderabad)తో జ‌రిగిన ఉత్కంఠ మ్యాచులో ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) జ‌ట్టు 7 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ సీజ‌న్‌లో ఢిల్లీ జ‌ట్టుకు ఇది వ‌రుస‌గా రెండో విజ‌యం. మ్యాచ్ గెలిచిన త‌రువాత ఢిల్లీ జ‌ట్టు కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్(David Warner) చేసుకున్న సెల‌బ్రేష‌న్స్ మామూలుగా లేవు. గెలుపు మ‌త్తులో ఉన్న వార్న‌ర్‌కు ఐపీఎల్ నిర్వాహ‌కులు షాకిచ్చారు. స్లో ఓవ‌ర్‌రేటు కార‌ణంగా రూ.12లక్ష‌ల ఫైన్ ప‌డింది.

IPL 2023 DC Vs SRH : చతికిలపడిన సన్ రైజర్స్.. ఢిల్లీ కేపిటల్స్ గెలుపు

నిర్దేశించిన స‌మ‌యంలోగా బౌలింగ్ కోటాను పూర్తి చేయ‌డంలో వార్న‌ర్ సేన విఫ‌ల‌మైంది. దీంతో ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించినందుకు జ‌ట్టు కెప్టెన్ అయిన వార్న‌ర్‌కు జ‌రిమానా విధించారు. రూ.12ల‌క్ష‌లు ఫైన్ వేసిన‌ట్లు ఐపీఎల్ నిర్వాహ‌కులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ సీజన్‌లో ఢిల్లీ జ‌ట్టు ఇలా తొలి సారి త‌ప్పు చేసింది కాబ‌ట్టి వార్న‌ర్‌కు కేవ‌లం ఫైన్ ప‌డింది.రెండోసారి కూడా ఇలానే జ‌రిగితే అప్పుడు కెప్టెన్‌కు రూ.24ల‌క్ష‌లు, తుది జ‌ట్టులోని ఒక్కొ ఆట‌గాడికి రూ.6ల‌క్ష‌లు లేదా మ్యాచ్‌లో 25 శాతం(రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే అది) ఫైన్ వేయ‌నున్నారు. మూడో సారి కూడా ఇలాగే జ‌రిగితే జ‌ట్టు కెప్టెన్‌కు రూ.30ల‌క్ష‌ల జ‌రిమానాతో పాటు మ్యాచ్ నిషేదం విధిస్తారు. మిగిలిన స‌భ్యుల‌కు రూ.12ల‌క్ష‌లు జ‌రిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత ప‌డనుంది.

David warner: కెప్టెన్సీ తొల‌గించి, జ‌ట్టులో చోటివ్వ‌కుండా, డ్రింక్స్‌ మోపించి.. అవ‌మానించిన జ‌ట్టు పై వార్న‌ర్ గెలుపు సంబ‌రాలు

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 144 ప‌రుగులు చేసింది. మ‌నీశ్‌ పాండే(34; 27 బంతుల్లో 2 ఫోర్లు), అక్ష‌ర్ ప‌టేల్‌(34; 34 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ మూడు వికెట్లు తీయ‌గా, భువ‌నేశ్వ‌ర్ కుమార్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ల‌క్ష్య ఛేద‌న‌లో హైద‌రాబాద్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 137 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.మ‌యాంక్ అగ‌ర్వాల్‌(49; 39 బంతుల్లో 7ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్‌(31; 19 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్‌), వాష్టింగ‌న్ సుంద‌ర్‌(24 నాటౌట్; 15 బంతుల్లో 3ఫోర్లు) పోరాడినా ఫ‌లితం లేక‌పోయింది.