DC vs GG WPL 2023 : అదరగొట్టిన గుజరాత్ అమ్మాయిలు.. ఢిల్లీపై విజయం

గుజరాత్ అమ్మాయిలు అదరగొట్టారు. అద్భుత ఆటతీరు చూపించారు. సాధించింది తక్కువ స్కోరే అయినా, అవతల ఉన్నది పెద్ద జట్టు అయినా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ తో విజయం సాధించారు. ఢిల్లీని చిత్తు చేశారు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీతో, ఐదో స్థానంలో ఉన్న గుజరాత్ తలపడగా.. గుజరాత్ నే విజయం వరించింది.

DC vs GG WPL 2023 : అదరగొట్టిన గుజరాత్ అమ్మాయిలు.. ఢిల్లీపై విజయం

DC vs GG WPL 2023 : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(2023)లో భాగంగా గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో గుజరాత్ అమ్మాయిలు అదరగొట్టారు. అద్భుత ఆటతీరు చూపించారు. సాధించింది తక్కువ స్కోరే అయినా, అవతల ఉన్నది పెద్ద జట్టు అయినా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ తో విజయం సాధించారు. ఢిల్లీని చిత్తు చేశారు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీతో, ఐదో స్థానంలో ఉన్న గుజరాత్ తలపడగా.. గుజరాత్ నే విజయం వరించింది.

11 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది గుజరాత్. తొలుత గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.4 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌట్ అయింది.

Also Read..Visakhapatnam ODI: విశాఖ వన్డేకు పొంచి ఉన్న వర్షం ముప్పు.. 19న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్

గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్, తనూజా కన్వర్ 2, ఆష్లే గార్డనర్ తలో 2 వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్ చెరో వికెట్ తీశారు. ఢిల్లీ బ్యాటర్లలో మరిజేన్ కాప్ 36, అరుంధతి రెడ్డి 25, అలిస్ కాప్సే 22 పరుగులు చేశారు.

ఈ మ్యాచ్ లో చివర్లో కొద్దిగా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ బ్యాటర్ అరుంధతి రెడ్డి పోరాడడంతో ఆ జట్టు లక్ష్యాన్ని అందుకునేలా కనిపించింది. అయితే, అరుంధతిని కిమ్ గార్త్ అవుట్ చేయడంతో మ్యాచ్ గుజరాత్ వైపు మొగ్గింది. పూనమ్ యాదవ్ ను గార్డనర్ ఔట్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ కు తెరపడింది. గుజరాత్ గెలుపు ఖాయమైంది.

Also Read..Shoaib Akhtar: విరాట్ కోహ్లీ‌పై పాక్ మాజీ పేసర్ ప్రశంసల వర్షం.. సచిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. వికెట్లు పడకపోయినా, బ్యాటర్లు నిదానంగా ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులే చేసింది. ఓపెనర్ లారా వోల్వార్ట్ 57, ఆష్లే గార్డనర్ 51, హర్లీన్ డియోల్ 31 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో జెస్ జొనాస్సెన్ 2 వికెట్లు తీసింది. మరిజేన్ కాప్, అరుంధతి రెడ్డి చెరో వికెట్ తీశారు. ఈ లీగ్ లో 5 మ్యాచ్ లు ఆడిన గుజరాత్ కు ఇది రెండో విజయం. ఢిల్లీ 5 మ్యాచులు ఆడగా.. మూడు విజయాలు నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా, గుజరాత్ నాలుగో స్థానంలో నిలిచింది.