Virat Kohli: విరాట్ పది నెలల కూతురిపై కామెంట్లు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి – మహిళా సంఘాలు

తొలి మ్యాచ్ నుంచి అంచనాలతో ఎదురూచూసి ఒక్కసారిగా జట్టు ఓడిపోవడంతో కెప్టెన్ ను తిట్టిపోస్తున్నారు టీమిండియా అభిమానులు.

Virat Kohli: విరాట్ పది నెలల కూతురిపై  కామెంట్లు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి – మహిళా సంఘాలు

Virat Kohli

Virat Kohli: టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా టీమిండియా ఘోర ఓటములను ఎదుర్కొంది. పాకిస్తాన్ తో, న్యూజిలాండ్ తో పరాజయాలను చవిచూసింది. తొలి మ్యాచ్ నుంచి అంచనాలతో ఎదురూచూసి ఒక్కసారిగా జట్టు ఓడిపోవడంతో కెప్టెన్ ను తిట్టిపోస్తున్నారు టీమిండియా అభిమానులు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ పది నెలల కూతురిపైనా అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు.

పది నెలల పసిపాపపై అత్యాచార బెదిరింపులు కూడా ఆ విమర్శల్లో భాగమే. దీనిపై ఢిల్లీ కమిషనర్ ఫర్ ఉమెన్ ఘాటుగా స్పందించింది. ఇన్వెస్టిగేషన్ జరపాలని అటువంటి కామెంట్లు చేసిన వారిపై కఠినమైన చర్యలను వెంటనే తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

ఈ మేరకు నోటీసు విడుదల చేసింది. విరాట్ కోహ్లీ కూతురికి ప్రమాదం ఉందని అందులో పేర్కొన్నారు. ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ దీనిని సిగ్గు చేటు చర్యగా.. నేరానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. దీనికి సంబంధించిన లెటర్ హెడ్ న కూడా ట్విట్టర్ లో ఉంచారు ఢిల్లీ పోలీసులు..

……………………………………. : ఓటీటీలో పరిస్థితి ఎలా ఉండబోతుంది?

ఇక టీమిండియా ప్రదర్శనపైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాచ్ ఫలితాలను ఆపాదిస్తూ.. దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తున్నారు. కోహ్లీ కెప్టెన్సీ.. బ్యాటింగ్ తీరును విమర్శించగలం కానీ, క్రికెటర్ కుటుంబాన్ని విమర్శించే హక్కు ఎక్కడిదంటూ ఇంజమామ్ సైతం ప్రశ్నించాడు.

షమీపైనా మతపరమైన ట్రోలింగ్ జరుగుతుండటంతో విరాట్ కోహ్లీ తిప్పికొట్టాడు. ‘వెన్నెముక లేని వెధవలు చేసిన కామెంట్లకు రెస్పాండ్ అవను. సోషల్ మీడియాలో ఉండి వారి ఐడెంటిటీ కనిపించకుండా కామెంట్లు చేస్తుంటారు. ఇదంతా సరదా కోసం చేశామనుకుంటారు. కానీ, అది ఇతరుల మనస్సును ఎంత బాధిస్తుందో తెలీదు’ అని కోహ్లీ మీడియా సమావేశంలో అన్నాడు.