IPL 2021 : నిప్పులు చెరిగే బంతులు, ఉమ్రాన్ బుల్లెట్ వేగం

అత్యంత వేగంగా బంతిని విసిరి రికార్డు నెలకొల్పాడు. అతనే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్.

IPL 2021 : నిప్పులు చెరిగే బంతులు, ఉమ్రాన్ బుల్లెట్ వేగం

Umran

Umran Malik Bowling Speed : ఐపీఎల్ 2021 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఉత్కంఠభరితంగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. పలువురు క్రీడాకారులు రికార్డులు నెలకొల్పుతున్నారు. ఓ బౌలర్ నిప్పులు చెరిగే బంతులు వేస్తున్నాడు. బుల్లెట్ వేగంతో దూసుకొస్తున్న బంతులను బ్యాట్స్ మెన్స్ ఎదుర్కోక తిప్పలు పడాల్సి వస్తుంది. ఇతని బాల్ వేగం చూసి…అందరూ ఆశ్చర్యపోతున్నారు. అత్యంత వేగంగా బంతిని విసిరి రికార్డు నెలకొల్పాడు. అతనే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన ఇండియన్ పేస్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

Read More : BMW luxury SUV: ఐపీఎల్ బెట్టింగ్‌లో దొరికిపోయిన బీఎండబ్ల్యూ కార్

ఉమ్రాన్ మాలిక్. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. అరంగేట్ర మ్యాచ్ లోనే తన స్పీడ్ తో అదరగొడుతున్నాడు. తొలి మ్యాచ్ లోనే ఐపీఎల్ లో అత్యంత వేగంగా బంతులు విసిరాడు. ఏకంగా గంటకు 151.03 కిలోమీటర్ల వేగంతో విసిరిన ఓ బంతి ఆశ్చర్యపరిచింది. 2021, అక్టోబర్ 03వ తేదీ ఆదివారం కోల్ కతా – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కరోనా బారిన పడిన నటరాజన్ స్థానంలో తాత్కాలికంగా ఉమ్రాన్ మాలిక్ ను జట్టులో తీసుకుంది సన్ రైజర్స్. చాలాకాలంగా ఇతను నెట్ బౌలర్ గా ఉన్నాడు. నిప్పులు చెరిగే బంతులు విసిరాడు.

Read More : IPL 2021 KKR Vs SRH కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం

ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన ఇండియన్ బౌలర్ గా మహ్మద్ సిరాజ్ (గంటకు 145.97) రికార్డు ఉంది. ఇప్పుడా రికార్డును ఉమ్రాన్ బద్దలు కొట్టాడు. ఇతను జమ్మూ కాశ్మీర్ కు చెందిన వ్యక్తి. ఒక టీ 20, లిస్ట్ ఏ మ్యాచ్ ఆడి నాలుగు వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఇతను ఐపీఎల్ మ్యాచ్ లో 141 కి.మీటర్లు తగ్గని వేగంతో బంతులు విసురుతున్నాడు. అత్యంత వేగవంతమైన డెలివరీ కేకేఆర్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ పేరిట ఉంది. ఇతను 152.75 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు.