IPL 2023-David Warner: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా రిషభ్ పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో తమ జట్టు సారథ్య బాధ్యతలను డేవిడ్ వార్నర్ కు అప్పగిస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఇవాళ ప్రకటించింది. గత సీజన్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు రిషభ్ పంత్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. అతడు కారు ప్రమాదంతో తీవ్రంగా గాయపడడంతో ఐపీఎల్-2023కు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్నాడు.

IPL 2023-David Warner: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా రిషభ్ పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్

IPL 2023-David Warner

IPL 2023-David Warner: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో తమ జట్టు సారథ్య బాధ్యతలను డేవిడ్ వార్నర్ కు అప్పగిస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఇవాళ ప్రకటించింది. గత సీజన్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు రిషభ్ పంత్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. అతడు కారు ప్రమాదంతో తీవ్రంగా గాయపడడంతో ఐపీఎల్-2023కు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ ఇవాళ తమ కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరన్న విషయంపై ప్రకటన చేసింది. కెప్టెన్ గా డేవిడ్ వార్నర్, వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ వ్యవహరిస్తారని చెప్పింది. డేవిడ్ వార్నర్ తన ఐపీఎల్ కెరీర్ ను 2009లో ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి ప్రారంభించాడు. అప్పట్లో ఆ జట్టు పేరు ఢిల్లీ డేర్ డెవిల్స్ గా ఉండేది. అనంతరం ఐదేళ్ల తర్వాత డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి మారాడు.

అతడి సారథ్యంలో 2016లో హైదరాబాద్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. 2022 నుంచి మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ లో ఆడుతున్నాడు. కాగా, రిషభ్ పంత్ సమర్థవంతమైన నాయకుడని, అతడిని మిస్ అవుతున్నామని డేవిడ్ వార్నర్ ఇవాళ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. తనపై నమ్మకం ఉంచి సారథ్య బాధ్యతలు అప్పగించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్ మెంట్ కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నాడు.

ఐపీఎల్-2023 సీజన్ మార్చి 31 నుంచి మే 28 వరకు జరగనుంది. తొలి మ్యాచు అహ్మదాబాద్ లో మోతెరా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. దేశ వ్యాప్తంగా 12 పట్టణాల్లో మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 10 టీమ్స్ మధ్య 70 లీగ్ మ్యాచులు జరుగుతాయి. మే 28న అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.

R Ashwin: బౌలింగ్‌లో నెంబర్ వన్ స్థానానికి అశ్విన్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన స్పిన్నర్