IPL 2023: ఢిల్లీ విజ‌యం.. పంజాబ్ ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం

ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓట‌మిపాలైంది. ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 15 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

IPL 2023: ఢిల్లీ విజ‌యం.. పంజాబ్ ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం

Delhi Capitals win

PBKS vs DC: ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓట‌మిపాలైంది. ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 15 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి.  పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఏదైనా అద్భుతం జ‌ర‌గాల్సిందే.

ల‌క్ష్య ఛేద‌న‌లో పంజాబ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 198 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. లియామ్ లివింగ్‌స్టోన్(94; 48 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స‌ర్లు), అథర్వ తైడే(55; 42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించ‌గా శిఖ‌ర్ ధావ‌న్‌(0), జితేశ్ శ‌ర్మ‌(0), షారుక్ ఖాన్‌(6)లు విఫ‌లం అయ్యారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ఇషాంత్ శ‌ర్మ‌, అన్రిచ్ నొర్టే చెరో రెండు వికెట్లు తీయ‌గా, ఖ‌లీల్ అహ్మ‌ద్‌, అక్ష‌ర్ ప‌టేల్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

IPL 2023: పంజాబ్‌పై ఢిల్లీ విజ‌యం

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 213 ప‌రుగులు చేసింది. రిలీ రూసో( 82 నాటౌట్; 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), పృథ్వీ షా(54; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ‌శ‌త‌కాల‌తో విరుచుకుప‌డ‌గా, డేవిడ్ వార్న‌ర్(46; 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించాడు. ఆఖ‌ర్లో ఫిలిఫ్ సాల్ట్ (26నాటౌట్; 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) దూకుడుగా ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో సామ్‌క‌ర‌న్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌, పృథ్వీ షాలు శుభారంభం అందించారు. వీరిద్ద‌రు పంజాబ్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. య‌డా పెడా బౌండ‌రీలు బాద‌డంతో ప‌వ‌ర్ పే కు (6 ఓవ‌ర్ల‌కు) ఢిల్లీ 61/0 తో నిలిచింది. అనంత‌రం ఇద్ద‌రూ అదే దూకుడును కొన‌సాగించారు. అయితే అర్ధ‌శ‌త‌కానికి నాలుగు ప‌రుగుల దూరంలో సామ్‌క‌ర‌న్ బౌలింగ్‌లో వార్న‌ర్‌ ఔట్ అయ్యాడు. దీంతో 94 ప‌రుగుల తొలి వికెట్ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది.

IPL 2023 playoffs: ప్లే ఆఫ్స్ రేసును ర‌స‌వత్త‌రంగా మార్చిన లక్నో విజ‌యం

పృథ్వీ షాతో రిలీ రొసో జ‌త‌క‌లిసాడు. ఈ క్ర‌మంలో 36 బంతుల్లో అర్ధ‌శ‌త‌కానికి అందుకున్న పృథ్వీ సైతం సామ్ క‌ర‌న్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 148 ప‌రుగుల వ‌ద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. అయిన‌ప్ప‌టికి పంజాబ్‌కు పెద్ద‌గా సంతోషించ‌డానికి ఏమీ లేకుండా పోయింది. ఫిలిఫ్ సాల్ట్ జ‌త‌గా రూసో దంచికొట్టాడు. 25 బంతుల్లోనే అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు రూసొ. హాఫ్ సెంచ‌రీ త‌రువాత మరింత వేగంగా ఆడాడు. ఫిలిఫ్ కూడా మెరుపులు మెరిపించ‌డంతో పంజాబ్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.