IPL 2023, DC vs GT: గుజ‌రాత్‌కు షాక్‌.. ప్ర‌తీకారం తీర్చుకున్న ఢిల్లీ

ఐపీఎల్‌(IPL)2023లో భాగంగా అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్రమోదీ స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) ప్ర‌తీకారం తీర్చుకుంది. గ‌త మ్యాచ్‌లో త‌న‌ను ఓడించిన గుజ‌రాత్‌ను ఓడించి లెక్క స‌రి చేసింది.

IPL 2023, DC vs GT: గుజ‌రాత్‌కు షాక్‌.. ప్ర‌తీకారం తీర్చుకున్న ఢిల్లీ

DC Win( pic ipl)

IPL 2023, DC vs GT: ఐపీఎల్‌(IPL)2023లో భాగంగా అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్రమోదీ స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) ప్ర‌తీకారం తీర్చుకుంది. గ‌త మ్యాచ్‌లో త‌న‌ను ఓడించిన గుజ‌రాత్‌ను ఓడించి లెక్క స‌రి చేసింది. స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కాపాడుకుని 5 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. 131 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 125 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

IPL 2023, DC vs GT: ఉత్కంఠభ‌రిత పోరులో గుజ‌రాత్‌పై ఢిల్లీ విజ‌యం..Live Updates

గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా(59 నాటౌట్‌; 53 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌గా అభినవ్ మనోహర్(26;33 బంతుల్లో 1సిక్స్‌) ప‌ర్వాలేద‌నిపించాడు. చివ‌ర్లో రాహుల్ తెవాటియా (20; 7 బంతుల్లో 3 సిక్స‌ర్లు) దంచి కొట్ట‌డంతో గుజ‌రాత్ విజ‌యానికి ఆఖ‌రి ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు అయ్యాయి. అయితే.. తొలి మూడు బంతుల‌కు మూడు ప‌రుగులే ఇచ్చిన ఇషాంత్ శ‌ర్మ నాలుగో బంతికి తెవాటియాను ఔట్ చేశాడు. మిగిలిన రెండు బంతుల్లో మూడు ప‌రుగులే ఇచ్చాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ఖ‌లీల్ అహ్మ‌ద్,ఇషాంత్ శ‌ర్మ చెరో రెండు వికెట్లు తీయ‌గా నోర్జే, కుల్దీప్ యాద‌వ్ లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

IPL 2023: మళ్లీ రచ్చరచ్చ చేశారు.. గంభీర్, కోహ్లీ మధ్య తీవ్ర వాగ్వాదం.. అడ్డుకున్న ఇరు జట్ల సభ్యులు .. వీడియోలు వైరల్

అంత‌క‌ముందు..టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 130 ప‌రుగులు చేసింది. 23 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు క‌ష్టాల్లో ప‌డిన ఢిల్లీ జ‌ట్టును అమన్ హకీమ్ ఖాన్(51; 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీతో ఆదుకున్నాడు. అక్ష‌ర్ ప‌టేల్‌(27; 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రిపాల్ పటేల్(23; 13 బంతుల్లో 2ఫోర్లు, 1 సిక్స్ ) ప‌ర్వాలేద‌నిపించారు. డేవిడ్ వార్న‌ర్‌(2), ఫిలిప్ సాల్ట్(0), ప్రియమ్ గార్గ్‌(10), రిలీ రోసో(8), మ‌నీష్ పాండే(1)విఫ‌లం అయ్యారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ నాలుగు వికెట్లు తీయ‌గా, మోహిత్ శ‌ర్మ రెండు, ర‌షీద్ ఖాన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.