ఢిల్లీ క్యాపిటల్స్.. vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్..: వాతావరణం.. పిచ్ రిపోర్ట్.. గెలిచేదెవరు?

  • Published By: vamsi ,Published On : September 20, 2020 / 12:36 PM IST
ఢిల్లీ క్యాపిటల్స్.. vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్..: వాతావరణం.. పిచ్ రిపోర్ట్.. గెలిచేదెవరు?

క‌రోనా భయంతో అల్లాడుతున్న జ‌నానికి ఐపీఎల్ రూపంలో కాస్త వినోదం దొరకింది. క్రికెట్‌ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్‌లు.. స్టేడియం పైకప్పు తాకే సిక్సర్లు.. వికెట్లను గాల్లోకి ఎగరేసే యార్కర్లు.. పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. పడీ పడీ పట్టే క్యాచ్‌లు.. ఒక్కటా రెండా ఎన్నో ఎన్నోన్నో.. కొత్త యువకులేమో వారి సత్తాను ఛాటుకునేందుకు పడే పాట్లు.. ఈ భీక‌ర‌పోరు గెలిచేది ఎవ‌రు..? ఈ ఐపీఎల్‌లో హాట్‌ ఫేవరెట్‌ ఎవరు..? అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు మరికొన్ని మ్యాచ్‌లు జరగాల్సిందే.

ఇప్పటికే ఒక్క మ్యాచ్ ముంబై ఇండియన్స్.. చైన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగగా.. అంచనాలకు మించి చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన చేసింది. ఇక ఐపిఎల్ 2020లో రెండవ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యూఏఈలో ఆడిన అన్నీ మ్యాచ్‌లలో గెలిచింది. ఇప్పుడు కూడా అదే విజయ పరంపరను యూఏఈలో కొనసాగించాలని కోరుకుంటుంది పంజాబ్. అదే సమయంలో ఈసారి యువ ఆటగాళ్లతో హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నమెంట్‌ను విజయంతో ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తుంది.

ఢిల్లీ జట్టులో శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షా, అజింక్య రహానె, రిషబ్ పంత్, మార్కస్ స్టోయినిస్, డేనియల్ సైమ్స్, శిమ్రాన్ హెట్మియర్ వంటి గొప్ప ఆటగాళ్ళు ఉన్నారు. అదే సమయంలో, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో కెఎల్ రాహుల్, గ్లెన్ మాక్స్‌వెల్, క్రిస్ గేల్, సర్ఫరాజ్ ఖాన్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పురాన్ వంటి పరిణతి చెందిన ఆటగాళ్ళు ఉన్నారు. ఈ లీగ్ టైటిల్‌ను ఇప్పటివరకు ఇరు జట్లు గెలుచుకోలేదు. ఉత్తమ బ్యాటింగ్ ప్రతిభ కలిగిన యువ భారతీయ ఆటగాళ్లు రెండు జట్లలో ఉన్నారు.

వాతావరణం:
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, అబుదాబి మాదిరిగానే, ఇక్కడ కూడా ఆటగాళ్ళు తీవ్రమైన వేడిని ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే, ఇక్కడ కూడా మంచు) ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు.

పిచ్ రిపోర్ట్:
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పిచ్‌లో గడ్డి ఉంటుందని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపారు. అటువంటి పరిస్థితిలో, ఇక్కడ ఫాస్ట్ బౌలర్లకు పెద్ద రోల్ ఉండవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా, పిచ్ చాలా కాలం పాటు కప్పబడి ఉండడంతో.. మ్యాచ్‌కు ముందు పిచ్‌పై నీరు పోయాలి. దీనిని బట్టి, ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్.. Playing XI (అంచనా):
ఢిల్లీ క్యాపిటల్స్- శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శిమ్రాన్ హెట్మేయర్, మార్కస్ స్టోయినిస్, కెమో పాల్ / డేనియల్ సామ్స్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇశాంత్ శర్మ మరియు కగిసో రబాడా.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. Playing XI (అంచనా):
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ – కెఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, సర్ఫ్‌రాజ్ ఖాన్, గ్లెన్ మాక్స్‌వెల్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), మన్‌దీప్ సింగ్, కృష్ణప్ప గౌతమ్, క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ మరియు షెల్డన్ కాట్రెల్.

మ్యాచ్ అంచనా:
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. యువ ఆటగాళ్లతో పటిష్టమైన జట్టుగా ఢిల్లీ ఉంది.



పూర్తి జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, షిమ్రాన్ హెట్మియర్, రిషబ్ పంత్(WK), మార్కస్ స్టోయినిస్, ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, సందీప్ లమిచనే, ఇశాంత్ శర్మ, అజింఖరా మహానే పటేల్, మోహిత్ శర్మ, అలెక్స్ కారీ, అవెష్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, అన్‌రిచ్, డేనియల్ సామ్స్, లలిత్ యాదవ్, కీమో పాల్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కెఎల్ రాహుల్ (కెప్టెన్), లోకేష్ రాహుల్(w/c), క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్‌వెల్, దీపక్ హుడా, మన్‌దీప్ సింగ్, జేమ్స్ నీషామ్, జగదీషా సుచిత్, మహ్మద్ షమీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, క్రిస్ జోర్డాన్, కరుణ్ నాయర్ మురుగన్ అశ్విన్, కృష్ణప్ప గౌతమ్, షెల్డన్ కాట్రెల్, హర్దస్ విల్జోయెన్, ఇషాన్ పోరెల్, సర్ఫరాజ్ ఖాన్, తాజిందర్ సింగ్, దర్శన్ నల్కండే, అర్ష్‌దీప్ సింగ్, సిమ్రాన్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, రవి బిష్ణోయ్

DC vs KXIP Dream11 Team Prediction:
Keeper – Rishabh Pant, KL Rahul (c)
Batters – Shikhar Dhawan, Shreyas Iyer (vc), Mandeep Singh
All-Rounders – Glenn Maxwell, Krishnappa Gowtham
Bowlers – Kagiso Rabada, Ravichandran Ashwin, Mohammed Shami, Mujeeb-ur-Rahman