Denmark Open: క్వార్టర్ ఫైనల్ నుంచి పీవీ సింధు ఔట్

ఇండియన్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ నుంచి తప్పుకున్నారు. డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో శుభారంభాన్ని నమోదు చేసిన సింధు..

Denmark Open: క్వార్టర్ ఫైనల్ నుంచి పీవీ సింధు ఔట్

Pv Sindhu

Denmark Open: ఇండియన్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ నుంచి తప్పుకున్నారు. డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో శుభారంభాన్ని నమోదు చేసిన సింధు.. ఉమెన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ రేసులో కొరియాకి చెందిన 8వ సీడ్ యన్ సియాంగ్‌తో పోరాడి ఓడారు. 11-21, 12-21 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు.

సుదీర్ఘంగా సాగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ తర్వాత కాస్త అలసిపోయినట్లు కనిపించి.. ఈ మ్యాచ్‌లో కేవలం 36 నిమిషాల్లోనే చేతులెత్తేసింది. ఇదే ప్రత్యర్థితో రెండేళ్ల క్రితం రెండు వరుస సెట్లలోనూ పరాజయానికి గురైంది సింధు.

తొలి సెట్‌లో 7-8 తేడాతో కొరియా షట్లర్‌పై ఆధిక్యం సాధించిన పీవీ సింధు, ఆ తర్వాత వరుస పాయింట్లు కోల్పోయి మొదటి సెట్‌ను సమర్పించింది. ఆ తర్వాత రెండో సెట్‌లో దూకుడు పెంచిన సియాంగ్, సింధుపై సునాయాస విజయాన్ని నమోదుచేసింది…

……………………………………: గుజరాత్, యూపీల నుంచి కొత్త ఐపీఎల్ జట్లు!!

టోక్యో ఒలింపిక్స్‌లో లాంటి మెగా ఈవెంట్‌లో కాంస్యం గెలిచిన సింధు.. మొట్టమొదటి మహిళా అథ్లెట్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు పీవీ సింధు. కొంతకాలం బ్రేక్ తీసుకుని తిరిగి డెన్మార్మ్ ఓపెన్‌‌లోనే బరిలోకి దిగింది.