India’s Probable Squad: ధావన్ కెప్టెన్‌గా శ్రీలంక టూర్.. భారత్ జట్టు ఇదే?

India’s Probable Squad: ధావన్ కెప్టెన్‌గా శ్రీలంక టూర్.. భారత్ జట్టు ఇదే?

Dhavan Leads Indias Probable Squad For Tour Of Sri Lanka

India’s Squad For Sri Lanka Tour: భారత జట్టు జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్ళబోతుంది. ఈ సిరీస్‌లో రెండు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడతాయి. భారత జట్టు శ్రీలంక పర్యటనకు సెలక్షన్ కమిటీ త్వరలో జట్టును ప్రకటించబోతుంది. ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లని వాళ్లు శ్రీలంకకు వెళ్తుండగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అందుబాటులో లేనికారణంగా.. శ్రీలంక టూర్‌కు కెప్టెన్ ఎవరూ? అనే విషయమై సందేహాలు తలెత్తాయి.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ముగ్గురూ శ్రీలంక పర్యటనకు అందుబాటులో లేని కారణంగా జట్టులో సీనియర్ మోస్ట్ ప్లేయర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఉండవచ్చునని అందరూ భావించారు. శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో ఉంటే అతనే కెప్టెన్‌గా ఉంటారని అనుకున్నారు. అయితే, లేటెస్ట్‌గా శ్రేయాస్ అయ్యర్ తప్పుకున్నాడు.

లంక పర్యటన కోసం జట్టుని ప్రకటించేందుకు బీసీసీఐ సెలెక్టర్లు సిద్ధం అవుతుండగా.. శ్రేయాస్ సెలక్షన్‌కి అందుబాటులో ఉండటం లేదని తెలిసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో శ్రేయస్‌ అయ్యర్ భుజానికి తీవ్ర గాయమవగా.. ఇంకా అతను కోలుకోలేదు. ఈ క్రమంలో ధావన్ జట్టుకు సారధిగా వ్యవహరించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ధావన్ మొదటిసారి జట్టుకు సారథ్యం వహించబోతున్నారు.

ఇంగ్లండ్ టూర్‌కి ఎంపికవని భారత క్రికెటర్లతో రెండో జట్టుని లంక పర్యటన కోసం బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించబోతున్నారు. ఇందులో శిఖర్ ధావన్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, రాహుల్ తెవాటియా తదితరులు ఉన్నారు.

జూలై 5న శ్రీలంకకు వెళ్లి 28న తిరుగు పయనం కానుండగా.. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ ఆడుతుంది భారత్. సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లూ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి.

Probable Squad: Shikhar Dhawan (c) ,Prithvi Shaw, Suryakumar Yadav, Devdutt Padikkal, Ishan Kishan, Hardik Pandya, Krunal Pandya, Yuzvendra Chahal, Kuldeep Yadav, Varun Chakravarthy, Bhuvneshwar Kumar, Deepak Chahar, Harshal Patel, Ruturaj Gaikwad, Sanju Samson, Navdeep Saini, Jaydev Unadkat, Chetan Sakaria