Twitterలో ధోనీ రిటైర్మెంట్ ట్రెండింగ్.. Fans ట్వీట్ వార్

  • Published By: sreehari ,Published On : October 29, 2019 / 12:15 PM IST
Twitterలో ధోనీ రిటైర్మెంట్ ట్రెండింగ్.. Fans ట్వీట్ వార్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఫ్యాన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ రిటైర్మెంట్ అంటూ సోషల్ మీడియాలో #Dhoniretires హ్యాగ్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనిపై ధోనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ట్రెండ్ అవుతున్న ఈ హ్యాష్ ట్యాగ్‌ను ధోనీ ఫ్యాన్స్ అదే స్థాయిలో తిప్పికొట్టారు.

దీనికి విరుగుడిగా #NeverRetireDhoni అనే హ్యాగ్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ధోనీ రిటైర్స్ అనే హ్యాష్ ట్యాగ్ లో నిజం లేకపోవడంతో ధోనీ ఫ్యాన్స్ దెబ్బకు వెంటనే ట్రెండింగ్ నుంచి హ్యాష్ ట్యాగ్ మాయమైపోయింది. ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటించాలో అతడికి బాగా తెలుసునని తమదైన శైలిలో ట్వీట్లతో రెచ్చిపోతున్నారు. ధోనీ అభిమానులు ఒక్కొక్కరిగా అతడి ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ను గుర్తు చేసుకుంటూ ధోనీ 7 జెర్సీ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. 

జూన్ నెలలో న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్లో టీమిండియా ఓడిన అప్పటి నుంచి ధోనీ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. సొంత గడ్డపై జరిగే బంగ్లాదేశ్ సిరీస్ భారత జట్టును ఎంపిక చేసిన అనంతరం చీఫ్ సెలెక్టర్ ఎమ్ ఎస్కే ప్రసాద్ మాట్లాడారు. ‘ముందుకు కొనసాగుతున్నాం. ఎంతో స్పష్టతో ఉన్నాం. ప్రపంచ్ కప్ పూర్తి చేశాం. రిషబ్ పంత్ ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చాం.

అతడు బాగా ఆడతాడని ఆశిస్తున్నాం. అతడికి మంచి మ్యాచ్ లు లేకపోవచ్చు. అయినా అతడిపై మాత్రమే దృష్టిపెడుతున్నాం’ అని ప్రసాద్ చెప్పారు. ప్రపంచ కప్ తర్వాత భారత జట్టులో యువకులకే అవకాశం ఇవ్వాలని చూస్తున్నామని తెలిపారు. మా ఉద్దేశం ఏంటో ఇప్పటికే మీకు తెలిసే ఉంటుందని భావిస్తున్నామన్నారు. 

ఈ విషయంలో ధోనీని కూడా కలిసి మాట్లాడటం జరిగింది. యువకులకు స్థానం కల్పించడాన్ని ధోనీ కూడా స్వాగతించినట్టు ఆయన చెప్పారు. ధోనీ రిటైర్మెంట్ విషయంలో సౌరవ్ గంగూలీ కూడా స్పందించారు. ధోనీ రిటైర్మెంట్ పై అతడు తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పాడు. ధోనీ మనస్సులో ఏముందో నాకు తెలియదన్నాడు. ఎంఎస్ ధోనీ వంటి క్రికెటర్ విషయంలో దేశం ఎంతో గర్వపడుతోంది. ధోనీ సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని గంగూలీ ప్రశంసించాడు.