MS Dhoni : ధోని హెయిర్‌ స్టైల్‌ అదరహో.. లక్షల్లో లైకులు

భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని న్యూలూక్ లో కనిపించారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్‌ హక్కీమ్‌ కొత్త స్టైల్ లో హెయిర్ కట్ చేశారు. ఇందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి

MS Dhoni : ధోని హెయిర్‌ స్టైల్‌ అదరహో.. లక్షల్లో లైకులు

Ms Dhoni (2)

MS Dhoni : భారత క్రికెట్ జట్టు కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనికి ప్రత్యేక స్థానం ఉంది. భారత జట్టు ధోని సారథ్యంలో అత్యధిక విన్నింగ్ రేట్ నమోదు చేసింది. అంతేకాదు టెస్ట్ క్రికెట్లో నంబర్ వన్ స్థానం దక్కించుకుంది. ధోని సారథ్యంలో భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించింది. ధోని ఆటకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తన హెయిర్ స్టైల్ కూడా అదే రేంజ్ లో ఇస్తారు.

ధోని స్టైలిష్ లుక్ లో కనిపించేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సమయంలో జుంపాల జుట్టోతో ఉన్న ధోని, ఆ తర్వాత అనేక హెయిర్ స్టైల్స్ మార్చారు. ఈయన హెయిర్ స్టైల్ ఫాలో అయ్యే అభిమానులు ధోని కొత్త లుక్ లో కనిపించగానే వారు కూడా తమ హెయిర్ స్టైల్ మార్చేస్తుంటారు.

 

 

View this post on Instagram

 

A post shared by Aalim Hakim (@aalimhakim)

 

ఇక తాజా న్యూ లుక్ లో కనిపించారు ధోని. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్‌ హక్కీమ్‌ ధోనికి హెయిర్ కట్ చేశారు. ధోని న్యూలుక్ ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. ఈ లుక్‌ను ఫంకీ హెయిర్‌ స్టైల్‌గా పేర్కొంటారని తెలుస్తోంది. ఈ లుక్‌ కుర్రకారును తెగ ఆకర్షిస్తోంది. ఆ ఫొటోలను నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. కుర్రకారు ఈ హెయిర్‌ స్టైల్‌ను చేయించుకోవాలని భావిస్తున్నారు.