స్నేహమంటే ఇదేరా: ఫిడల్ కాస్ట్రో చనిపోయిన రోజే మారడోనా మృతి

  • Published By: madhu ,Published On : November 26, 2020 / 01:33 PM IST
స్నేహమంటే ఇదేరా: ఫిడల్ కాస్ట్రో చనిపోయిన రోజే మారడోనా మృతి

Diego Maradona and Fidel Castro : డీగా మారడోనా.. అర్జెంటినా ఫుట్‌బాల్ ప్లేయర్.., కోట్లాది మంది అభిమానులకు అతను ఆడితే వచ్చే కిక్కే వేరు.. ఫుట్ బాల్ ఆటను ప్రేమించేవాళ్లకు మారడోనా ఓ అద్భుతం.. ఫిడల్ కాస్ట్రో.. విప్లవకారుడు, ఉద్యమనేత, కమ్యూనిస్ట్ యోధుడు, అలనాటి ప్రపంచ నేతల్లో ఒకరు.. ఆయన కంఠం వినేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎదరుచూసేవారు. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం కూడా ఎక్కువే.. ముప్పై ఏళ్ల వయస్సు తేడా ఉన్నా కూడా.. ఇద్దరి మధ్య స్నేహం అపారం.



ఇప్పుడు ఇద్దరూ కన్నుమూశారు. ఫిడెల్ కాస్ట్రో కన్నుమూసిన నాలుగేళ్ల తర్వాత అదే రోజు మారడోనా ఈ లోకం విడిచారు. ప్రపంచమంతా మారడోనాకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయ్యో అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఫిడల్ కాస్ట్రో 25 నవంబర్ 2020 తేదీన 90ఏళ్ల వయస్సులో చనిపోగా.. ఇప్పుడు 4ఏళ్ల తర్వాత అదే తేదీన 60ఏళ్ల వయస్సులో మారడోనా చనిపోయాడు. ఇది యాదృచ్ఛికమే అయినా.. స్నేహానికి నిదర్శనం ఇదని భావిస్తున్నారు వారి ఇరువురి అభిమానులు.



https://10tv.in/genius-and-scandal-diego-maradona-life/
మారడోనాకి విప్లవ యోధుడికి మధ్య స్నేహం ప్రపంచ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. వాస్తవానికి వీరిదద్దరికీ స్నేహం కుదరడానికి కారణం మారడోనాకు ఉన్న డ్రగ్స్ అలవాటు. డ్రగ్స్, ఆల్కహాల్ కారణంగా ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు మారడోనా.. బరువుపై అదుపు కోల్పోయాడు. ఒక దశలో 128 కిలోల బరువుకు చేరుకుని, 2004లో గుండెపోటు కూడా వచ్చింది. తరువాత బేరియాటిక్ సర్జరీ చేయించుకుని 30 కిలోల బరువు తగ్గాడు. 2007 నుంచి తరచూ తన అనారోగ్యం వార్తలు, హాస్పిటళ్లలో చికిత్సలు గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు తను మరణించాడనే అబద్దపు వార్తలు వినిపించాయి. డ్రగ్స్ కు బానిసైన మారడోనా అందులోంచి బయట పడేందుకు క్యూబాలో చికిత్స తీసుకోగా.. ఆ సమయంలో కాస్ట్రో, మారడోనా మధ్య స్నేహం కుదిరింది. ఒకరకంగా డ్రగ్స్ బానిసత్వం నుంచి బయటపడేందుకు ఫిడల్ కాస్ట్రో కూడా ఓ కారణం.



క్యూబాలో ఉన్న కాలంలో ఫిడెల్ కాస్ట్రో తనను మార్నింగ్ వాక్‌కు పిలిచేవాడని, రాజకీయాలు, క్రీడల గురించి మాట్లాడేవారని పలు సందర్భాల్లో మారడోనా వెల్లడించారు. కాస్ట్రోను అతను అమితంగా ఆరాధించే మారడోనా.. ఆయనను తన తండ్రి సమానులుగా భావించేవారు. ప్రేమను చాటుకొనేందుకు ఎడమకాలిపై కాస్ట్రో టాటూ కూడా వేయించుకున్నాడు మారడోనా. కుడి కాలిపై మరో విప్లవ యోధుడు చేగువేరా టాటూ ఉండేది. పలు రాజకీయాలపై కూడా మారడోనా స్పందించేవారు. లాటిన్ అమెరికా వామపక్ష నేతలకు మద్దతు ఇచ్చేవారు. వెనిజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ తోనూ మారడోనాకు మంచి సంబంధాలున్నాయి.



https://10tv.in/tribute-to-soccer-legend-diego-maradona/
కాస్ట్రో చనిపోయిన నవంబర్ 25వ తేదీనే డిగో మారడోనా తుది శ్వాస విడవడం యాదృచ్చికమని చెప్పవచ్చు. అర్జెంటినాలోని బ్యూనస్ ఎయిర్స్ గల తన నివాసంలో గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. 1960 అక్టోబర్ 30వ తేదీన ఆయన జన్మించారు. ప్రస్తుతం అర్జెంటినా ఫుట్ బాల్ జట్టుకు మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. నాలుగుసార్లు ఫుట్ బాల్ వరల్డ్ కప్ కు ప్రాతినిధ్యం వహించిన మారడోనా..1997లో ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.