Most Ducks in IPL: రోహిత్‌తో పోటీప‌డుతున్న దినేశ్ కార్తిక్‌.. తిట్టిపోస్తున్న ఫ్యాన్స్‌.. ఏం విష‌యంలోనే తెలిస్తే షాక్‌

టీమ్ఇండియా ఆట‌గాళ్లు హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌, దినేశ్ కార్తిక్‌లు ఓ విష‌యంలో పోటీప‌డుతున్నారు. దీన్ని చూస్తున్న అభిమానులు మాత్రం వీరిద్ద‌రిపై మండిప‌డుతున్నారు.

Most Ducks in IPL: రోహిత్‌తో పోటీప‌డుతున్న దినేశ్ కార్తిక్‌.. తిట్టిపోస్తున్న ఫ్యాన్స్‌.. ఏం విష‌యంలోనే తెలిస్తే షాక్‌

Dinesh Karthik-Rohit Sharma

Dinesh Karthik-Rohit Sharma: టీమ్ఇండియా ఆట‌గాళ్లు హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma), దినేశ్ కార్తిక్‌(Dinesh Karthik)లు ఓ విష‌యంలో పోటీప‌డుతున్నారు. దీన్ని చూస్తున్న అభిమానులు మాత్రం వీరిద్ద‌రిపై మండిప‌డుతున్నారు. అదేంటీ పోటీ మంచిదేగా అంటారా..? అక్క‌డికే వ‌స్తున్నాం ఆగండి. ప‌రుగుల విష‌యంలో పోటీప‌డితే బాగానే ఉంటుంది కానీ ఈ ఇద్ద‌రు ఓ చెత్త రికార్డు కోసం కొట్లాడుకుంటున్నారు.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, దినేశ్ కార్తిక్ రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ఆడుతున్నాడు. ఆదివారం జైపూర్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తిక్ డ‌కౌట్ అయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొన్న డీకే.. జంపా బౌలింగ్‌లో ఎల్భీగా ఔట్ అయ్యాడు. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్న రోహిత్ శ‌ర్మ స‌ర‌స‌న చేరాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు.

Rohit Sharma: హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఖాతాలో చెత్త రికార్డు

వీరిద్ద‌రు ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో 16 సార్లు డ‌కౌట్లు అయ్యారు. వీరి త‌రువాత 15 డ‌కౌట్ల‌తో మ‌న్‌దీప్ సింగ్‌, సునీల్ న‌రైన్‌లు ఉన్నారు. కార్తిక్ డ‌కౌట్ విష‌యంలో ఆర్‌సీబీ అభిమానులు మండిప‌డుతున్నారు. పోయిన సీజ‌న్‌లో ఫినిష‌ర్‌గా అద‌ర‌గొట్టిన నువ్వు.. ఈ సీజ‌న్‌లో రోహిత్‌తో డ‌కౌట్ల విష‌యంలో పోటీప‌డుతూ జ‌ట్టుకు భారంగా మారుతున్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 11 ఇన్నింగ్స్‌ల్లో కార్తిక్ 140 ప‌రుగులు చేశాడు. అత్య‌ధిక స్కోరు 30 ప‌రుగులు.

IPL 2023: విజృంభించిన ఆర్‌సీబీ బౌల‌ర్లు.. 59 ప‌రుగుల‌కే రాజ‌స్థాన్ ఆలౌట్‌.. బెంగ‌ళూరు ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. పాప్ డుప్లెసిస్‌(55; 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు), గ్లెన్ మాక్స్‌వెల్‌(54; 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు చేసింది. అనంత‌రం బెంగ‌ళూరు బౌల‌ర్లు విజృంభించ‌డంతో రాజ‌స్థాన్ జ‌ట్టు 10.3 ఓవ‌ర్ల‌లో 59 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో బెంగ‌ళూరు 112 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది.