Dinesh Karthik: తానొక బాల్ బాయ్ అని గుర్తు చేసుకున్న దినేశ్ కార్తీక్

కోల్‌కతా వేదికగా 2001వ సంవత్సరం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ లు జరిగాయి. ఆ సమయంలో తాను బాల్ బాయ్ గా వ్యవహరించానని వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ రివీల్ చేశాడు.

Dinesh Karthik: తానొక బాల్ బాయ్ అని గుర్తు చేసుకున్న దినేశ్ కార్తీక్

Dinesh Karthik

Dinesh Karthik: కోల్‌కతా వేదికగా 2001వ సంవత్సరం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ లు జరిగాయి. ఆ సమయంలో తాను బాల్ బాయ్ గా వ్యవహరించానని వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ రివీల్ చేశాడు. సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు కామెంటరీ ప్యానెల్ లో ఒకరుగా మారిన దినేశ్ కార్తీక్ అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నాడు.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ కలిసి నాలుగో రోజు ఆటకు చేసిన స్కోరుతో టీమిండియా 384పరుగుల ఆధిక్యానికి చేరుకుంది. ఫలితంగా టీమిండియా సిరీస్ ను 1-1తో సమం చేయగలిగింది. ఆ తర్వాత చెన్నైలో మూడో టెస్టు ఆడారు.

‘ఆ తర్వాతి టెస్టు మ్యాచ్ కు నేను బాల్ బాయ్ గా చేశా. వీళ్లందరికీ బాల్స్ విసురుతూ ఉండేవాడిని’ అని చెప్తూ.. 15ఏళ్ల వయస్సులో ఉన్నానని చెప్పుకొచ్చాడు కార్తీక్.

‘అప్పుడు నేను 8గంటలకు లేచేవాడ్ని. టీవీ ఆన్ చేసి చూస్తూ ఉండేవాడ్ని. ఓ యంగ్ ప్లేయర్ కు ఇది చాలా కీలకం. అప్పట్లో ఆస్ట్రేలియా టీం అలా ఉండేది’ అని కార్తీక్ అన్నారు.

మూడో టెస్టుకు అదే మూమెంటం కొనసాగించిన టీమిండియా.. ఆస్ట్రేలియాపై 2-1తేడాతో గెలిచి చూపించింది. 2004లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఇండియా జట్టులో ఒకడిగా టెస్టు ఫార్మాట్ అరంగ్రేటం చేశాడు కార్తీక్. అందులో తాను 10 పరుగులు, 4పరుగులు మాత్రమే చేశాడు.