మరోసారి మనమే గెలిచాం.. గోల్డ్‌ దక్కించుకున్న దివ్య కక్రాన్

  • Published By: sreehari ,Published On : February 20, 2020 / 06:47 PM IST
మరోసారి మనమే గెలిచాం.. గోల్డ్‌ దక్కించుకున్న దివ్య కక్రాన్

ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌2020లో భారతదేశానికి మరో బంగారు పతకం దక్కింది. 68కిలోల కేటగిరీలో భారత రెజ్లర్ దివ్యా కక్రాన్ విజయం సాధించింది. దీంతో బంగారు పతకం సాధించిన రెండో భారతీయ మహిళగా దివ్య కక్రాన్ నిలిచింది. ఆధిపత్య ప్రదర్శనతో ముందుకు సాగిన దివ్య.. జూనియర్ ప్రపంచ ఛాంపియన్ నరుహా మాట్సుయుకిని ఓడించి అన్ని మ్యాచ్‌లను గెలిచింది. పవర్ రెజ్లింగ్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న దివ్యా.. ఐదు రెజ్లర్ 68 కేజీల విభాగంలో నాలుగు బాట్‌లను గెలుచుకుంది. 

ఈ మ్యాచ్ రాబిన్ ఫార్మాట్ లో జరిగింది. 2018లో ఆసియా చాంపియన్ షిప్‌లో భాగంగా బిష్కెక్, కిర్గిజిస్థాన్‌లో 65కేజీలో విభాగంలో జరిగిన పోటీలో నవజోత్ కౌర్ బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. ఆతిథ్య జట్టు చిరస్మరణీయమైన రోజులో సరితా హోర్ (59 కిలోలు), పింకి (55 కిలోల), నిర్మలా దేవి (50 కిలోలు) ఫైనల్స్ వరకు చేరుకుని రజత పతకాలను సాధించారు. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత దివ్య కజకిస్తాన్ అల్బినా కైర్గెలినోవాను ఓడించడం ద్వారా మంగోలియాకు చెందిన డెల్గెర్మా ఎన్‌ఖ్సైఖాన్‌ను మట్టికరిపించింది. 

పోటీ మధ్యలో మంగోలియన్‌కు వ్యతిరేకంగా కొంచెం కదిలినట్లు అనిపించినప్పటికీ ఆమె తన ప్రత్యర్థిని చిత్తు చేసింది. మూడో రౌండ్‌లో దివ్య ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అజోడా ఎస్బెర్జెనోవాపై విజయం సాధించింది. ఆమె వరుసగా అద్భుతమైన రోల్స్‌తో 4-0తో పైకి దూసుకెళ్లింది. ప్రత్యర్థిని కట్టడి చేసి.. కేవలం 27 సెకన్లలోనే బాట్ పూర్తి చేసింది. రెండవ వ్యవధిలో జపనీస్ ఘనమైన ఆరంభం సాధించింది.

ఎడమ కాలుపై దాడి చేస్తూ ముందుకు సాగింది. కానీ, కుడి కాలు కదలికతో పాయింట్లను సాధించి 4-4 స్కోరు సాధించింది. జపనీయులు ఆమెను దాదాపుగా కట్టడి చేశారు. అయినా ఆత్మవిశ్వాసంతో దివ్య కష్టతరమైన స్థానం నుండి నెగ్గింది. తర్వాతి మ్యాచ్  9 కిలోల ఫైనల్లో మంగోలియాకు చెందిన బాట్‌ సెటెగ్ అట్లాంట్‌సెట్‌ సెగ్‌తో దివ్యా పోరాడనుంది.