Sehwag: సెహ్వాగ్ ఓపెనర్‌గా రావడం వెనుక కారణం ఎవరో తెలుసా.. అక్తర్ ప్రశ్నకు సెహ్వాగ్ ఏమన్నాడంటే..?

సెహ్వాగ్.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు వింటే పూనకాలు వచ్చేస్తాయి. సెహ్వాగ్ క్రిజ్‌లో ఉన్నాడంటే టీవీలకు అతుక్కుపోయి చూసేవాళ్లు. అవతల ఎలాంటి టీమైనా, ఎలాంటి బౌలరైనా సెహ్వాగ్ క్రిజ్ లో ఉన్నాడంటే పరుగుల వదర పారేది.

Sehwag: సెహ్వాగ్ ఓపెనర్‌గా రావడం వెనుక కారణం ఎవరో తెలుసా.. అక్తర్ ప్రశ్నకు సెహ్వాగ్ ఏమన్నాడంటే..?

Virender Sehwag

Sehwag: సెహ్వాగ్.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు వింటే పూనకాలు వచ్చేస్తాయి. సెహ్వాగ్ క్రిజ్‌లో ఉన్నాడంటే టీవీలకు అతుక్కుపోయి చూసేవాళ్లు. అవతల ఎలాంటి టీమైనా, ఎలాంటి బౌలరైనా సెహ్వాగ్ క్రిజ్ లో ఉన్నాడంటే పరుగుల వదర పారేది. కంటికి కనిపించే లోపు బ్యాట్ మీదకు దూసుకొచ్చే బాల్స్ ను సైతం బౌండరీలు దాటించడంలో సెహ్వాగ్ దిట్ట. ఆరంభంలో సెహ్వాగ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గానే  క్రిజ్‌లోకి వచ్చేవాడు. కానీ తరువాతి కాలంలో గంగూలీ సారథ్యంలో సెహ్వాగ్ ఓపెనర్‌గా వచ్చాడు. అంతకుముందు సచిన్ – గంగూలీ ఓపెనర్స్ గా వచ్చేవారు. సెహ్వాగ్ – సచిన్ జోడీ  కిక్ కావడంతో ఆ తరువాత వారే మొదటి బ్యాట్స్ మెన్లుగా క్రిజ్ లోకి వచ్చారు.

Cricket With Umbrella: గొడుగుతో కూడా క్రికెట్ ఆడొచ్చని మీకు తెలుసా..! ఈ వీడియో చూస్తే..

సెహ్వాగ్ ఓపెనర్ గా క్రిజ్ లోకి రావడానికి టీంలో పెద్ద చర్చే జరిగిందట. ఆ విషయాన్ని సెహ్వాగ్ చెప్పాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్ లో పాక్ మాజీ పేసర్ సోయబ్ అక్తర్ తో సెహ్వాగ్ ప్రత్యేక చిట్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా అక్తర్ పలు ఆసక్తికరమైన ప్రశ్నలను సెహ్వాగ్ కు సంధించాడు. అందులో ఒకటి.. నువ్వు ఓపెనర్ గా క్రిజ్ లోకి రావడానికి ప్రధాన కారణం ఎవరు అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం గంగూలీ అయి ఉంటాడని అందరూ భావిస్తుంటారు. ఎందుకంటే గంగూలీ సారథ్యంలోనే సెహ్వాగ్ ఓపెనర్ గా వచ్చాడు కాబట్టి.

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే గంగూలీ కెప్టెన్ గా కొనసాగుతున్నా సెహ్వాగ్ ను ఓపెనర్ గా పంపాలని తొలుత ప్రతిపాదించింది ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ అంట. జహీర్ ఖాన్ పలుసార్లు సెహ్వాగ్ ను ఓపెన్ గా పంపించాలని గంగూలీకి సూచించాడు. దీంతో గుంగూలీ సైతం అందుకు సుముఖత వ్యక్తం చేసి ఓపెనర్ గా పంపించడంతో అప్పటి నుంచి సచిన్- సెహ్వాగ్ జోడీ సరికొత్త రికార్డులు సృష్టించింది.