Mirabai Chanu : మీరాబాయి చానుకు డొమినోస్ బంపర్ ఆఫర్..జీవితకాలం పిజ్జా ఫ్రీ

Mirabai Chanu : మీరాబాయి చానుకు డొమినోస్ బంపర్ ఆఫర్..జీవితకాలం పిజ్జా ఫ్రీ

Domino's

Domino’s Offers : మీరాబాయి చాను పేరు మారుమ్రోగుతోంది. టోక్యో ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం సాధించి భారత పతాకాన్ని రెపరెపలాడించారు. 49 కేజీల మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఈ పతకాన్ని సాధించారు. దీంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వెయిట్ లిఫ్టింగ్ లో పతకం కోసం గత 21 సంవత్సరాలుగా భారతదేశం ఎదురు చూస్తోంది. ఒలింపిక్స్ లో రెండో రోజే మీరాబాయి చాను పతకం సాధించడంతో భారత తన ఖాతాను తెరిచింది.

Read More : Tadipatri : ప్రియుడితో కలిసి సొంతింట్లోనే చోరీ..ఆ తర్వాత

పతకం సాధించడంతో సోషల్ మీడియాలో ఆమెను అభినందిస్తూ..పోస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పలు బహుమతులను ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా డొమినోస్ ఇండియా (Domino’s pizza) కూడా ఓ నిర్ణయాన్ని వెలువరించింది. మల్టీనేషనల్ పిజ్జా సంస్థల్లో డొమినోస్ ప్రధానమైంది. చానుకు లైఫ్ టీం ఫ్రీ పిజ్జా అందివ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు ట్వీట్ చేసింది. మీరాబాయి చాను చెప్పారు..తాము విన్నామని, పిజ్జా తినేందుకు చాను వేచి ఉండాలని తాము కోరుకోవడం లేదని డొమినోస్ ప్రకటించింది. అందుకే డొమినోస్ పిజ్జాను జీవితాంతం అందిస్తామని వెల్లడించింది. గతంలో పిజ్జాను చాలాకాలంగా తినలేదని, ఇది తినాలని కోరుకుంటున్నట్లు మీరాబాయి చాను వెల్లడించారు. దీంతో పతకం గెలిచిన వెంటనే డొమినోస్ ఇండియా ఆ నిర్ణయం తీసుకుంది.